AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : విడాకులు ఇచ్చిన తర్వాత కూడా హార్దిక్ ఇంటికి వచ్చిన మాజీ భార్య నటాషా .. పాత రోజులు గుర్తొస్తున్నాయేమో ?

హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా స్టాంకోవిచ్ వడోదరలో హార్దిక్ కుటుంబాన్ని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరూ మళ్ళీ కలిసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. తన మాజీ భర్త హార్దిక్ పాండ్యా కుటుంబ సభ్యులను కలిసి వారితో సరదాగా సమయం గడిపారు.

Hardik Pandya : విడాకులు ఇచ్చిన తర్వాత కూడా హార్దిక్ ఇంటికి వచ్చిన మాజీ భార్య నటాషా .. పాత రోజులు గుర్తొస్తున్నాయేమో ?
Natasa Stankovic Spotted With Hardik Pandyas Family
Rakesh
|

Updated on: Apr 06, 2026 | 11:30 AM

Share

Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌లకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. తాజాగా నటాషా చేసిన ఒక పని ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. నటాషా స్టాంకోవిచ్ ఆదివారం నాడు వడోదరలో ప్రత్యక్షమయ్యారు. తన మాజీ భర్త హార్దిక్ పాండ్యా కుటుంబ సభ్యులను కలిసి వారితో సరదాగా సమయం గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హార్దిక్ తల్లి, అమ్మమ్మ, సోదరి, సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి నటాషా ఎంతో ఆత్మీయంగా ఫోటోలకు పోజులిచ్చారు. విడిపోయిన తర్వాత కూడా అత్తగారి కుటుంబంతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మళ్ళీ కలుస్తున్నారా?

నటాషా షేర్ చేసిన ఈ ఫోటోలు చూస్తుంటే హార్దిక్, నటాషాలు రహస్యంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? లేక త్వరలోనే మళ్ళీ ఒక్కటి కాబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక యూజర్ రీయూనియన్ లోడింగ్… అంటూ కామెంట్ చేయగా, మరికొందరు పాండ్యా కుటుంబం నటాషాను చూసుకుంటున్న విధానాన్ని ప్రశంసిస్తున్నారు. వ్యక్తిగత విభేదాలు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధం చెక్కుచెదరలేదని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది.

స్ట్రాంగ్ బాండ్.. అభిమానుల ప్రశంసలు

ఈ పర్యటనలో నటాషా చాలా రిలాక్స్‌గా, సంతోషంగా కనిపించారు. హార్దిక్ తల్లితో కలిసి ఆమె దిగిన ఫోటోలు చూస్తుంటే వారి మధ్య ఉన్న గౌరవం, ప్రేమ ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. సాధారణంగా విడిపోయిన తర్వాత చాలామంది మాజీ అత్తమామలకు దూరంగా ఉంటారు, కానీ నటాషా మాత్రం అలా చేయకుండా తన బిడ్డ తండ్రి తరపు బంధువులతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇది ఆమె వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని చాటుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఆర్సీబీ స్టార్ కృనాల్ పాండ్యాతో ముచ్చట్లు

ఈ భేటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ క్రికెటర్, హార్దిక్ అన్న కృనాల్ పాండ్యా కూడా ఉన్నారు. నటాషా తన బావ కృనాల్‌తో కూడా సరదాగా గడిపారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే హార్దిక్-నటాషాల విడాకుల నిర్ణయం వెనుక ఏదైనా రాజీ కుదిరే అవకాశం ఉందేమోనని అభిమానులు ఆశిస్తున్నారు. ఏదేమైనా, ఈ వైరల్ ఫోటోలు ఇప్పుడు స్పోర్ట్స్, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us