AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson Failure : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ట్రేడింగ్? సంజూ రాకతో సీఎస్‌కేకి శని పట్టుకుందా?

Sanju Samson Failure : ఐపీఎల్ 2026లో సంజూ శాంసన్ వైఫల్యంపై సీఎస్‌కే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమవడమే కాకుండా, మైదానంలో అతని బాడీ లాంగ్వేజ్ కూడా నిస్సత్తువగా ఉందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఏదో అయిష్టంగా ఆడుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Sanju Samson Failure : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ట్రేడింగ్? సంజూ రాకతో సీఎస్‌కేకి శని పట్టుకుందా?
Sanju Samson
Rakesh
|

Updated on: Apr 06, 2026 | 10:33 AM

Share

Sanju Samson Failure : ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరిస్థితి ఏమీ బాగోలేదు. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయింది. అయితే, ఈ ఓటముల కంటే ఇప్పుడు సీఎస్‌కే అభిమానులను ఎక్కువగా బాధిస్తున్న విషయం.. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఫామ్. రాజస్థాన్ రాయల్స్ నుంచి భారీ అంచనాల మధ్య ట్రేడింగ్ ద్వారా చెన్నైలోకి అడుగుపెట్టిన సంజూ, వరుసగా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. మొన్నటి టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజేతగా నిలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను తన బ్యాటింగ్‌తో భయపెట్టిన సంజూ, ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రం చేతులెత్తేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన మొదటి మూడు మ్యాచుల్లో అతను చేసిన స్కోర్లు వరుసగా 6, 7, 9. అంటే మొత్తం మీద మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. వరల్డ్ కప్ గెలిచిన ఊపులో ఐపీఎల్‌ను ఊపేస్తాడని భావించిన అభిమానులకు సంజూ ఆటతీరు తీవ్ర నిరాశను కలిగిస్తోంది.

సంజూ కేవలం పరుగులు చేయకపోవడమే కాదు, మైదానంలో అతని ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారింది. చెన్నై జెర్సీలో సంజూ అస్సలు సంతోషంగా కనిపించడం లేదని, ఏదో అయిష్టంగా ఆడుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్‌గా సంజూలో ఉన్న ఆ కసి, ఆకలి ఇప్పుడు చెన్నైలో కనిపించడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో కూడా సంజూ త్వరగా అవుట్ కావడంతో సోషల్ మీడియాలో స్టెప్ అసైడ్ సంజూ(సంజూ తప్పుకో) అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది.

ఒక చెన్నై అభిమాని ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. “ప్రియమైన సంజూ.. నీవు మానసికంగా ఈ టీమ్‌తో కనెక్ట్ కాలేకపోతే, దయచేసి కొన్ని మ్యాచులు పక్కన కూర్చో. మైదానంలో కెమెరా నీవైపు తిరిగిన ప్రతిసారీ నువ్వు అసహనంగా కనిపిస్తున్నావు. నీలో ఆ గెలుపు కసి, వేగం ఎక్కడ పోయాయి? కనీసం నువ్వు టీమ్ కోసం ఆడుతున్నావు అన్నట్లుగా అయినా నీ బాడీ లాంగ్వేజ్ ఉండాలి కదా” అంటూ తీవ్రంగా స్పందించారు. శాంసన్ కేరళ కుర్రాడు కావడంతో సౌత్ లో అతనికి ఉన్న విపరీతమైన క్రేజ్, ఇప్పుడు నెగటివ్ గా మారుతోంది.

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. ట్రిమ్ డేవిడ్ (70), దేవదత్ పడిక్కల్ (50), రజత్ పాటిదార్ (48) మెరుపు ఇన్నింగ్స్‌లతో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో చెన్నై మొదట్లోనే తడబడింది. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో కేవలం 30 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది. చివర్లో సర్ఫరాజ్ ఖాన్ (50), ప్రశాంత్ వీర్ (43) పోరాడినా.. చెన్నై 207 పరుగులకే పరిమితమై 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నైకి సంజూ ఫామ్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us