AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2026: కమ్మవారంతా కలిస్తే ప్రభంజనమే.. డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే.. అరవ రాజకీయాల్లో సెన్సేషన్..

అరవ రాజకీయాలపై గట్టిగా ఫోకస్ చేసింది కమ్మ సామాజిక వర్గం. సాంస్కృతికంగా, నైపుణ్యాలపరంగా, వ్యాపారం, సామాజిక బాధ్యత.. ఇలా అన్ని అంశాల్లో ముందువరుసలో ఉన్నాం, రాజకీయాల్లో మాత్రం ఎందుకు వెనకబడాలి.. పదండి ముందుకు అంటూ తమిళనాడులో బల నిరూపణ చేసింది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. తమిళ పార్టీలకు క్లియర్‌కట్‌గా ఒక అల్టిమేటమ్ కూడా జారీ చేసింది. ఏమిటది?

KGF 2026: కమ్మవారంతా కలిస్తే ప్రభంజనమే.. డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే.. అరవ రాజకీయాల్లో సెన్సేషన్..
Kgf Meeting
Shaik Madar Saheb
|

Updated on: Feb 09, 2026 | 9:17 AM

Share

కమ్మ వారి ఐక్యత వర్థిల్లాలి అని పిడికిలి బిగించింది కేజీఎఫ్.. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో వేలాదిమందితో మెగా కమ్మ మహానాడు నిర్వహించింది కేజీఎఫ్. రెండు తెలుగు రాష్ట్రాలే కాక తమిళనాడు నుంచి కూడా అనేకమంది కమ్మ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సామాజికవర్గానికి చెందినవారున్నారు. ఇది, దేశ జనాభాలో 1.5 శాతం కంటే ఎక్కువ. తమిళనాడులో అత్యధికంగా 65 లక్షల మంది కమ్మవాళ్లున్నప్పటికీ, రావల్సినంత గుర్తింపు రావడం లేదని వాపోయారు నేతలు. సామాజిక ఐక్యత ద్వారా రాజకీయ బలం చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈమేరకు వ్యూహం కూడా సిద్ధం చేసుకుంది కేజీఎఫ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ప్రాతినిథ్యం లభించేలా కమ్మ మహానాడు ద్వారా ఓ డిమాండ్ కూడా వెళ్లింది.

కమ్మ సమాజంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా చేయూతనివ్వడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కేజీఎఫ్ ప్రకటించింది. 65 లక్షల ఓటు బ్యాంకుతో ఏకంగా డిప్యూటీ సీఎం కుర్చీ మీదే కర్చీఫేసి, ఆ దిశగా వర్కవుట్స్ జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఏ పార్టీకీ మద్దతు ప్రకటించకపోయినా శ్రీపెరంబదూర్ కమ్మ మహానాడు ఒక రాజకీయ స్పష్టతనైతే ఇచ్చినట్టయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..