KTR: దళితబంధును ఎవరూ ఆపలేరు.. పది రోజుల్లో పథకం కంటిన్యూ అవుతుంది: కేటీఆర్
తెలంగాణలో దళిత బంధును ఎవరూ ఆపలేరన్నారు మంత్రి కేటీఆర్. హుజూరాబాద్ ఉప ఎన్నిక పది రోజుల్లో ముగుస్తుందని, ఆ తర్వాత పథకం కంటిన్యూ

Dalit Bandhu – KTR – Huzurabad: తెలంగాణలో దళిత బంధును ఎవరూ ఆపలేరన్నారు మంత్రి కేటీఆర్. హుజూరాబాద్ ఉప ఎన్నిక పది రోజుల్లో ముగుస్తుందని, ఆ తర్వాత పథకం కంటిన్యూ అవుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు ప్లీనరీనే ఫస్ట్ ప్రయార్టీ అని, హుజూరాబాద్ బైపోల్ సెకండ్ ప్రయార్టీ అని వివరించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు కేటీఆర్. హుజురాబాద్‌లో కాంగ్రెస్ డిపాజిట్ తెచ్చుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి ఇక చిలక జోస్యం చెప్పుకోవాల్సిందేనని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించారు. ఏడాది తరువాత ఈటెల రాజేందర్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి ప్లాన్ చేశారన్నారు. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని, హుజురాబాద్‌లో పీసీసీ రోల్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో ఎవరు ఏంటో తెలిపోతుందన్నారు కేటీఆర్. హుజురాబాద్‌లో 100 శాతం గెలుపు టీఆర్‌ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.
అటు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా దళిత బంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై తమ, తమ వెర్షన్స్ వినిపిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం.. హుజురాబాద్ లో ఆగిపోడానికి కారణం.. బీజేపీయే అన్నది అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న మెయిన్ కంప్లయింట్. ఈ దిశగా పార్టీలో ఉన్న నాయకులు.. బీజేపీపై అటాక్ స్టార్ట్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి అయితే ఇది బీజేపీ ఉద్దేశ పూర్వక కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఇందుకు ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలన్నది మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటున్న మాట.
బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి రాసిన లేఖ వల్లే దళిత బంధు ఆగిందన్నది మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ అటాక్.. దళిత బంధు అమలు కాకుండా అధికార పార్టీయే ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేసిందన్నది కమలనాథుల వాదన.. ఎన్నికల కోసమే పథకం తెచ్చారని బీజేపీ ఆరోపిస్తుంటే.. ఎన్నికల తర్వాత కూడా.. పథకం అమలవుతుంది. కావాలంటే చూడమన్నది టీఆర్ఎస్ సమాధానం..
Read also:Kerala Floods: భారీ వర్షాలు, వరదలకు భీతిల్లిపోతోన్న కేరళ. 38కి మృతులు.. అనేక హృదయ విదారక దృశ్యాలు