Venkata Narayana |
Updated on: Oct 19, 2021 | 11:13 AM
భారీ వర్షాలు, వరదలకు వణికిపోతోంది కేరళ. కుండపోత వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
వర్షాలు, వరదల ధాటికి కేరళలో మృతుల సంఖ్య 38కి చేరింది. భారీ వరదలకు నలుగురు చిన్నారులతో సహా ఓ కుటుంబమంతా జలసమాధి అయిపోయింది.
కేరళలోని ప్రభావిత ఐదు జిల్లాల్లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.
భారీ వర్షాలు, వరదలు విలయం సృష్టిస్తున్నాయి. వరద ప్రవాహానికి పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి.
పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
వరద ఉధృతి, రోడ్లన్నీ జలమయం కావడంతో కూరలు వండే పెద్ద పాత్రలో వధువరులను వివాహ వేదిక వద్దకు తీసుకురావడం విశేషం