Live Video: కదులుతున్న రైలు నుంచి దిగేందుకు యత్నించిన గర్భిణీ.. క్షణాల్లో స్పందించి కాపాడిన కానిస్టేబుల్..

రైల్వే స్టేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ట్రాక్‎లు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని వాడకుండా పట్టాలు దాటాలని చూస్తారు. ఇలా ప్రమాదాలకు గురువుతారు. మరి కొందరు రన్నింగ్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తారు.

Live Video: కదులుతున్న రైలు నుంచి దిగేందుకు యత్నించిన గర్భిణీ.. క్షణాల్లో స్పందించి కాపాడిన కానిస్టేబుల్..
Train
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 19, 2021 | 9:10 AM

రైల్వే స్టేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ట్రాక్‎లు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని వాడకుండా పట్టాలు దాటాలని చూస్తారు. ఇలా ప్రమాదాలకు గురువుతారు. మరి కొందరు రన్నింగ్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కిందపడిపోతారు. అలాగే ట్రైన్ నడుస్తున్నప్పుడు తిగుతారు. ఇది కూడా ప్రమాదమే. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ గర్భిణీ నడుస్తున్న రైల్లో నుంచి దిగాలని చూసి కింద పడిపోయింది. అక్కడే ఉన్న రైల్వే పోలీసు ఆమెను రక్షించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

మహారాష్ట్ర ముంబై సమీపంలోని రైల్వే స్టేషన్‌లో రైలు వెళ్తుంది. అప్పుడు అందులో నుంచి ఓ గర్భణీ దిగేందుకు యత్నించింది. కానీ పట్టు తప్పి రైలు, ప్లాట్‎పారమ్ మధ్య పడిపోతుండగా.. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) యొక్క ఒక కానిస్టేబుల్ క్షణాల్లో స్పందించి కాపాడాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్‎లో సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) శివాజీ M సుతార్ ఈ సంఘటనకు సంబంధించిన CCTV ఫుటేజీని ట్విట్టర్‌లో పంచుకున్నారు. “ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ శ్రీ ఎస్ఆర్ ఖండేకర్ కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలును దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జారిపడిన గర్భిణీ స్త్రీని కాపాడారు” అని సుతార్ సోమవారం పోస్ట్ చేశారు. “ప్రయాణికులు రన్నింగ్ రైల్లో ఎక్కవద్దు లేదా దిగవద్దు అని రైల్వే విజ్ఞప్తి చేస్తుంది,” అని తెలిపారు. ప్రస్తుతు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also.. Viral Video: జంప్ చేయాలని చూస్తే జాడిచ్చి తన్నిన గుర్రం.. వీడియో వైరల్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?