AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఈ నెల 20న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. తొలి విమానంలో 125 మంది బౌద్ధ బిక్షువుల రాక..

ఈ వినాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలో వివిధ దేశాల రాయబారులు పాల్గొంటారు. శ్రీలంక నుండి ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం కూడా వేడుకల్లో పాల్గొనడానికి రానున్నది. 

PM Modi: ఈ నెల 20న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. తొలి విమానంలో 125 మంది బౌద్ధ బిక్షువుల రాక..
Pm Narendra Modi
Sanjay Kasula
|

Updated on: Oct 19, 2021 | 9:47 AM

Share

PM Narendra Modi: అక్టోబర్ 20 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా కుశీనగర్ గౌతమ బుద్ధుడు మహా పరి నిర్వాణం పొందిన ప్రదేశం ..బౌద్ధ తీర్థయాత్ర స్థలంగా ఖ్యాతిగాంచింది. ఈ వినాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలో వివిధ దేశాల రాయబారులు పాల్గొంటారు. శ్రీలంక నుండి ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం కూడా వేడుకల్లో పాల్గొనడానికి రానున్నది. కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటి విమానం శ్రీలంక రాజధాని కొలంబో నుండి వస్తుంది. ఇందులో 125 మంది ప్రముఖులు, బౌద్ధ సన్యాసులు ఉంటారు. ఈ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు బుద్ధ భగవానుని మహాపరినిర్వాణ ప్రదేశాన్ని సందర్శించడానికి సౌకర్యాన్ని హైలైట్ చేస్తుంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని ఇచ్చింది.

‘అతిథి దేవో భవ’కు అనుగుణంగా, విదేశీ అతిథుల ఘన స్వాగతం కోసం అవసరమైన సన్నాహాలు చేయాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని సన్నాహాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా చేయడానికి అన్ని తగిన విధంగా ఏర్పట్లు ఉండేలా చూడాలని చెప్పారు. ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఏర్పట్లు ఉండాలన్నారు.

ఇక మరోవైపు ఇదే నెలలో మరోసారి ప్రధాని మోడీ ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్ 25 న సిద్ధార్థనగర్ జిల్లా నుంచి ఏడు జిల్లాల్లోని ఏడు మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. అది రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు కానుంది. ఈవెంట్‌కు సంబంధించిన అన్ని సన్నాహాలు సకాలంలో పూర్తి చేయడానికి కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Sirimanu Utsavam: నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు..

Chanakya Niti: ఇలాంటి శత్రువులతో జాగ్రత సుమీ.. అలాంటివారి పట్ల ఏమరపాటు అసలే వద్దు..

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్