AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugodu Bypoll Results: అనుకున్నట్లే టీఆర్‌ఎస్‌‌కు ఇబ్బందిగా కారును పోలిన గుర్తులు.. చూడండి ఎన్ని ఓట్లు పడ్డాయో

అనుకున్నదే జరిగింది. కారును పోలిన గుర్తులతో టీఆర్‌ఎస్‌కు పెద్ద చిక్కొచ్చిపడింది. ఆయా గుర్తులకు గట్టిగానే ఓట్లు పడ్డాయి. 4 రౌండ్లు ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ కారు గుర్తును పోలీన సింబల్స్‌కు ఎన్ని ఓట్లు వచ్చాయో చూడండి.

Munugodu Bypoll Results: అనుకున్నట్లే టీఆర్‌ఎస్‌‌కు ఇబ్బందిగా కారును పోలిన గుర్తులు.. చూడండి ఎన్ని ఓట్లు పడ్డాయో
Munugode Bypoll Result
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2022 | 11:44 AM

Share

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య దోబూచులాడుతోంది. రౌండ్‌ రౌండ్‌కు అధిక్యం మారుతూ ఉత్కంఠ రేపుతోంది. మొత్తంగా ఇప్పటి వరకూ నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తికాగా… టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 714 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు  4,854, బీజేపీకి 4,555, కాంగ్రెస్‌‌కు 1,817 ఓట్లు వచ్చాయి. రౌండ్ల వారీగా ఆధిక్యాన్ని గమనిస్తే… ఒకటవ, నాలగవ రౌండ్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం చూపగా… రెండు, మూడు రౌండ్లలో బీజేపీ లీడ్‌ కనబర్చింది. అయితే  కారును పోలిన గుర్తు కలిగిన పలు సింబల్స్‌కు కొంచెం ఎక్కువగానే ఓట్లు పోలైనట్లు తాజాగా వచ్చిన డేటాను బట్టి తెలుస్తుంది. మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8(కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ) గుర్తులను తీసివేయాలని టీఆర్‌ఎస్ కోరినప్పటికీ.. ఎన్నికల సంఘం నుంచి రెస్పాన్స్ రాలేదు.

తాజా ఫలితాలను  4 రౌండ్ల కౌంటింగ్ అనంతరం గమనిస్తే.. చపాతి మేకర్ గుర్తు కలిగిన శ్రీశైలం యాదవ్‌కు  483 ఓట్లు పోలయ్యాయి. చెప్పులు గుర్తు కలిగిన గాలయ్యకు 498 ఓట్లు పోలయ్యాయి. రోడ్ రోలర్ గుర్తు కలిగిన శివకుమార్‌కు 335 ఓట్లు పోలయ్యాయి. ఇక నాలుగు రౌండ్లు ముగిసే సరికి కేఏ పాల్‌కు 174 ఓట్లు పోలయ్యాయి. ఓవరాల్‌ కౌంటింగ్ ముగిసేసరికి ఈ గుర్తులకు ఎన్ని ఓట్లు పడతాయ్ అన్నది ఆసక్తిగా మారింది. ఎంతోకొంత మేర ఈ సింబల్స్ టీఆర్‌ఎస్ గెలుపుపై, మెజార్టీపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలి రౌండ్ నుంచి టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ

  • తొలిరౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 6వేల 418 ఓట్లు రాగా… బీజేపీకి 5వేల 126 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీకి 2వేల 100 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ 12వందల 92 ఓట్ల లీడ్‌ సాధించింది.
  • రెండో రౌండ్‌కు వచ్చేసరికి… బీజేపీ లీడ్‌లోకి వచ్చింది. ఈ రౌండ్‌లో కారు గుర్తుకు 7వేల 781ఓట్లు పడగా… కమలం గుర్తుకు 8వేల662 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు కేవలం 15వందల 37 ఓట్లు పడ్డాయి. ఈ రౌండ్‌లో బీజేపీకి 841 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
  • మూడో రౌండ్‌లోనూ బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు 7వేల 390ఓట్లు రాగా, బీజేపీకి 7వేల 426 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి 19వందల 26 ఓట్లు పొందారు. ఈ రౌండ్‌లో బీజేపీకి 415 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
  • నాలుగో రౌండ్‌వకు వచ్చేసరికి పరిస్థితి మళ్లీ మారింది. ఈసారి కారు పార్టీ.. మళ్లీ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 4854 ఓట్లు రాగా, బీజేపీకి 4వేల 555 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 18వందల17 ఓట్లొచ్చాయి. 299ఓట్ల ఆధిక్యం సాధించింది టీఆర్‌ఎస్‌.

మొత్తంగా నాలుగు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యేసరికి… టీఆర్‌ఎస్‌కు 26వేల 443 ఓట్లు, బీజేపీకి 25వేల 729 ఓట్లు, కాంగ్రెస్‌కు ఏడువేల 380ఓట్లు వచ్చినట్టు లెక్కతేలింది. మొత్తంగా చూస్కుంటే.. టీఆర్‌ఎస్‌ పార్టీ 714 ఓట్లతో ముందంజలో ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..