AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: టీఆర్ఎస్ లీడ్ లోకి వస్తేనే రౌండ్ల వారీ ఫలితాలు.. సీఈఓ పై బండి సంజయ్ సంచలన కామెంట్స్..

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నారు. ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు కౌంటింగ్ పూర్తవగా.. టీఆర్ఎస్ ఆధిక్యంలో..

Bandi Sanjay: టీఆర్ఎస్ లీడ్ లోకి వస్తేనే రౌండ్ల వారీ ఫలితాలు.. సీఈఓ పై బండి సంజయ్ సంచలన కామెంట్స్..
Bandi Sanjay
Ganesh Mudavath
|

Updated on: Nov 06, 2022 | 12:13 PM

Share

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నారు. ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు కౌంటింగ్ పూర్తవగా.. టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని విమర్శించారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించడటం లేదని ఆరోపించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని బండి సంజయ్ ప్రశ్నించారు. మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించడం లేదని చెప్పారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నికల రౌండ్ల వారి ఫలితాలు వెల్లడించడంలో సీఈఓ విఫలమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆక్షేపించారు. సీఈఓ తీరు అనుమానాలకు తావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. మునుగోడు ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఈసీ తీవ్ర జాప్యం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారికంగా రౌండ్లు వారీగా ఫలితాలను వెల్లడించడంలో ఆలస్యం వహిస్తోందని మండిపడుతున్నాయి. హైదరాబాద్ ఎన్నికల కార్యాలయంలో ఫలితాలపై అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. సమాచార లోపంతో ఫలితాల వెల్లడికి ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే.. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 714 ఓట్లు లీడ్‌లో ఉంది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో ఆధిక్యం కనబచరిన టీఆర్ఎస్.. ఆ వెంటనే వెనుకబడి.. తిరిగి మళ్లీ వెంటనే పుంజుకుంది. బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ లో టీఆర్ఎస్ 613 ఓట్ల ఆధిక్యత సాధించింది. మునుగోడు ఓట్ల లెక్కింపులో తొలుత చౌటుప్పల్ మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ మండలంలోని ఓట్లను మొత్తంగా 4 రౌండ్లలో లెక్కించారు. నాలుగో రౌండ్ లో ఏకంగా 1,034 ఓట్ల ఆధిక్యం సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..