By Polls Results: ఉత్కంఠగా మారిన ఉప ఎన్నిక ఫలితాలు.. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలా ఉందంటే..
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికతో పాటు దేశంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయింది. మునుగోడులో ఇప్పటి వరకు..
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికతో పాటు దేశంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయింది. మునుగోడులో ఇప్పటి వరకు ఐదు రౌండ్లు కౌంటింగ్ జరగగా.. మొదటి రౌండ్ మినహా మిగతా నాలుగు రౌండ్లతో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ గెలుపు ఎవరు సాధిస్తారనే విషయం తీవ్ర ఉత్కంఠగా మారింది. మునుగోడు ఉప ఎన్నికతో పాటు దేశవ్యాప్తంగా మరో ఐదు నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఆరు రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. హర్యానాలో అందపూర్ ఉపఎన్నికపై ఆసక్తి ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆయన మనుమడు భవ్య బిష్ణోయ్ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. బిహార్‌లో ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఎన్నికను అనర్హమైనదిగా ప్రకటించడంతో అక్కడ ఉపఎన్నికలు జరిగాయి. ఆ స్థానంలో ఆయన భార్య నీలమ్ దేవీ పోటీ చేశారు. మోకామా నియోజకర్గం నుంచి బరిలో పాల్గొన్నారు. అదే రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ లోనూ ఉప ఎన్నిక జరిగింది.
బిహార్‌లో బీజేపీ, ఆర్జేడీ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. హర్యానాలో కాంగ్రెస్, ఐఎన్‌ఎల్‌డీ, ఆప్ మధ్య పోటీ ఉంది. మునుగోడుతో పాటు ఉత్తర ప్రదేశ్, ఒడిశాలోనూ బీజేపీ పోటీనిస్తోంది. గోలా గోకర్ణ్‌నాథ్ చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగింది. దీంతో సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. భాజపా ప్రయత్నిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఒడిశాలోని ధామ్‌నగర్‌లోనూ ఉప ఎన్నిక జరిగింది. మరికాసేపట్లో ఈ నియోజకవర్గాల ఫలితాలు తేలనున్నాయి.
మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గంలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు) అభ్యర్థి రుతుజ లట్కే ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుతో శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణించారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈసారి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కొత్త గుర్తు ‘కాగడా’తో బరిలోకి దిగింది. రమేశ్ లట్కే సతీమణి రుతుజా లట్కే పోటీలో ఉన్నారు. ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూడా రుతుజాకే మద్దతు ఇవ్వడంతో చివరకు స్వతంత్రులు మాత్రమే బరిలో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..