AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode ByPoll:మునుగోడులో కారు జోరు.. విజయం వైపు టీఆర్ ఎస్.. గట్టిపోటీనిచ్చిన కమలం.. కనిపించని హస్తం ప్రభావం..

తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రానే వచ్చింది. ముందు నుంచి త్రిముఖ పోటీ అని భావించినప్పటికి.. ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ, టీఆర్ ఎస్ మధ్య ద్విముఖ జరిగినట్లు అనిపించింది. మునుగోడు గడ్డ తమ అడ్డా అని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ అనుకున్నంత..

Munugode ByPoll:మునుగోడులో కారు జోరు.. విజయం వైపు టీఆర్ ఎస్.. గట్టిపోటీనిచ్చిన కమలం.. కనిపించని హస్తం ప్రభావం..
Kusukuntla Prabhakar Reddy and CK KCR
Amarnadh Daneti
|

Updated on: Nov 06, 2022 | 3:21 PM

Share

తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రానే వచ్చింది. ముందు నుంచి త్రిముఖ పోటీ అని భావించినప్పటికి.. ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ, టీఆర్ ఎస్ మధ్య ద్విముఖ జరిగినట్లు అనిపించింది. మునుగోడు గడ్డ తమ అడ్డా అని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ అనుకున్నంత పోటీనివ్వలేకపోయింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తుది వరకు పోరాడిన కారు జోరును తట్టుకోలేకనట్లు తెలుస్తోంది ఫలితాల సరళిని చూస్తే. 11 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 5వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ విజయం వైపు దూసుకెళ్తున్నారు. 15 రౌండ్ల కౌంటింగ్ లో ప్రతి రౌండ్ ఉత్కంఠభరితంగా సాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ కంటే నాలుగు ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి మొదటి రౌండ్లో వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. తరువాత రెండు, మూడు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి స్వల్ప అధిక్యాన్ని కనబర్చారు. అయినప్పటికి మూడు రౌండ్లు ముగిసిన తరువాత కూడా టీఆర్ ఎస్ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబర్చారు. నాలుగో రౌండ్ నుంచి 11 రౌండ్ల వరకు ప్రతి రౌండ్ లోనూ టీఆర్ ఎస్ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబర్చారు. 11 రౌండ్ల తర్వాత ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి కంటే 5794 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీంతో విజయం వైపు కారు పార్టీ దూసుకెళ్తోంది.

తమకు కేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉందని కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికి.. ఫలితాలు చూస్తే హస్తం పార్టీకి నిరాశను మిగిల్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికి ఫలితం దక్కలేదు. బీజేపీ ఓడినప్పటికి గట్టిపోటినిచ్చింది. 10 నుంచి 15 వేల మెజార్టీ టీఆర్ఎస్‌కు వస్తుందని ఆ పార్టీతో పాటు సర్వే మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేసినప్పటికి.. ఫలితం మాత్రం ఆ విధంగా లేదు. పది వేల లోపే మెజార్టీ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక బీఎస్పీతో పాటు తెలంగాణ జనసమితి అనుకున్నంత సంఖ్యలో ఓట్లను తెచ్చుకోలేకపోయింది. స్వతంత్య్ర అభ్యర్థుల్లో చపాతి రోలర్ గుర్తు మినహా మిగిలిన అభ్యర్థుల్లో చాలా మంది కనీసం వెయ్యి ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..