కేంద్రంతో అమీతుమీకి కేసీఆర్‌ సిద్దం.. ఈ నెల 21న టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి భేటీ.. అదే రోజు ఢిల్లీకి కేసీఆర్ బృందం

రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ సర్కార్ సమర శంఖం పూరించింది.

కేంద్రంతో అమీతుమీకి కేసీఆర్‌ సిద్దం.. ఈ నెల 21న టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి భేటీ.. అదే రోజు ఢిల్లీకి కేసీఆర్ బృందం
Telangana Cm Kcr
Follow us
TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Mar 19, 2022 | 6:19 PM

TRS Meeting: రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ సర్కార్ సమర శంఖం పూరించింది. ఈ క్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించినున్నట్లు సీఎం కేసీఆర్ ప్రక‌టించారు. ఈ స‌మావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవ‌ర్గ స‌భ్యులు, జిల్లా అధ్యక్షులు, జ‌డ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు స‌మితుల జిల్లా అధ్యక్షులు త‌ప్పనిస‌రిగా హాజ‌రు కావాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశంలో కేంద్రంపై ప్రత్యేక్ష సమరానికి రూపకల్పన చేయనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో యాసంగి వరిధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు ఈ సమావేశంలో ప్రణాళిక రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్‌సీఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనల కార్యక్రమాలు ఉధృతం చేసేలా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్. మీటింగ్ తర్వాత అదే రోజున ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు.

శనివారం సీఎం కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ధాన్యం సేకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూనే, ఇటు పార్లమెంటు ఉభయసభల్లోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను తెలియజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇది జీవన్మరణ సమస్య అని, వరి ధాన్యం కొనుగోళ్లపై ఈసారి టీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర పోరాటానికి సిద్ధమవుతోందని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సీఎం కోరారు.

Read Also…. 

CM KCR Meeting: ఎర్రవల్లి ఫాంహౌజ్ వేదికగా మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర మంతనాలు..!

Telangana Weather Report: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల కురిసిన వర్షం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!