Etela Rajender Resignation: టీఆర్‌ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా
Etela Rajender Resignation: అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు..
Etela Rajender Resignation: అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం నిన్న హైదరాబాద్‌కు వచ్చిన ఈటల రాజేందర్.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు.
రాత్రికి రాత్రే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని, ఉరిశిక్ష పడే ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ నా గురించి తెలుసుకోకుండా విచారణకు అదేశాలు ఇచ్చారు. నా ప్రాణం ఉండానే బొందబెట్టాలని చూశారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నామని అన్నారు. ఓ అనామకుడు ఉత్తరం రాస్తే మంత్రిపై చర్యలు తీసుకున్నారని అన్నారు. నాపై జరుగుతున్న దాడి, కుట్రలపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై చర్యలు సిద్ధమయ్యారు. బంగారు పళ్లెంలో పెట్టి అన్ని రకాల పదవులు ఇచ్చాం. ఇంకా ఏం ఇవ్వాలి. టీఆర్‌ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 19 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్‌లో ఉన్నా.. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు. డబ్బులు, కుట్రలతో ఉప ఎన్నికలలో అధికార పార్టీ గెలుపొందవచ్చు అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు రెండు సార్లు ప్రయత్నించినా.. కానీ అవకాశం ఇవ్వలేదని ఈటల అన్నారు.
రాష్ట్రం కోసమే అవమానాలు భరించాం
రాష్ట్రం కోసమే అవమానాలు భరించామని ఈటల రాజేందర్ అన్నారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్‌లు లేరు. వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.
సీఎంవో కార్యాలయంలో ఒక్క ఎస్సీ, ఎస్టీనైనా ఉన్నారా?
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు. 2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి ఎస్సీ అని చెప్పారు. సీఎంవో కార్యాలయంలో ఒక్క ఎస్సీ, ఎస్టీనైనా ఉన్నారా? సీఎంవో కార్యాలయంలో ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ అధికారి ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండరు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జీవోలు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమానికి ప్రయోజనం కలిగించేలా అనేక సంఘాలు పెట్టామని ఈటల వ్యాఖ్యానించారు.
రెండేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు
రెండేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ముఖ్యమంత్రికి చ ఎప్పి ఇప్పిస్తానని చెప్పాను. అయిన ఇంత వరకు కార్డులు జారీ కాలేదు. సంక్షేమ పథకాలను నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. రైతు బంధును వ్యతిరేకించలేదు.. డబ్బున్న వాళ్లకు కాకుండా నిరుపేదలకు ఇవ్వాలని చెప్పడం తప్పా.. అని అన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే.. రెండు నెలల వరకూ ముఖ్యమంత్రి పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రం కోసం ఎన్నో అవమనాలు భరించామని అన్నారు. ఆనాడు సంఘాలు కావాలి.. ఇప్పుడు అక్కర్లేదా..? అని ఈటెల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read: Etela Resignation Live: టీఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్ గుడ్‌బై.. మీడియా సమావేశంలో కీలక అంశాలు