Etela Resignation Highlights: టీఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్ రాజీనామా.. మీడియా సమావేశంలో కీలక అంశాలు వెల్లడి
Etela Rajender: అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌తో..
Etela Rajender: అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌తో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. షామీర్‌పేటలోని తన నివాసంలో నిర్వహిస్తున్న మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. అలాగే టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన ఈటల బీజేపీలో చేరనున్నారు. అయితే ఉద్యమం నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో తన పాత్రను వివరించడంతో పాటు తనకు ఎదురైన ఇబ్బందులను మీడియా ముందు చెబుతున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకొని గురువారం హైదరాబాద్ చేరుకున్న ఈటల రాజేందర్.. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
అనుచరులతో భేటీ అయిన ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించారు. టీఆర్‌ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయడంపై అనుచరుల నుంచి అభిప్రాయాలు కోరారు. అయితే పార్టీ వీడటంపై అనుచరుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా, ‘వారు పొమ్మనే వరకు ఉండటం సరైనదేనా’ అని ఈటల అనుచరులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదన ఆలోచనేదీ లేదని, బీజేపీలో చేరడం గురించే అభిప్రాయాలు కోరినట్లు ఈటల వ్యాఖ్యానించారు.
రాష్ట్రం కోసమే అవమానాలు భరించాం
రాష్ట్రం కోసమే అవమానాలు భరించామని ఈటల రాజేందర్ అన్నారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్‌లు లేరు. వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.
https://www.youtube.com/watch?v=Rq1yewZROx0
LIVE NEWS & UPDATES
-
19 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో ఉన్నా..
19 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో ఉన్నా.. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేలన చేశారు. కనీసం పది సీట్లు కూడా గెలవలేదని విమర్శించారు. అన్ని అవమానాలు భరించాము. ఇన్ని భరించినా పార్టీలో పేరు లేదు అని ఆరోపించారు.
-
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశా
19 ఏళ్ల టీఆర్‌ఎస్ అనుబంధానికి, తెరాస సభ్వత్వానికి రాజీనామా చేస్తున్నా అని ఈటల అన్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఎన్నిసార్లు బి-ఫారం ఇచ్చినా గెలిచానని అన్నారు. గతంలో 17 మంది రాజీనామా చేసి పోటీ చేస్తే కేవలం గెలిచింది ఏడుగురే. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు రాజీనామా చేశానని అన్నారు.
-
-
రాజీనామాలు చేయడం నాకు కొత్తేమి కాదు..
గ్రామాలు బాగుపడితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఈటల రాజేందర్ అన్నారు. రాజీనామాలు చేయడం నాకు కొత్తేమి కాదు.. ఎప్పుడు రాజీనామా చేసినా గెలిచాను అని అన్నారు.
-
నాకు ఓటమి తెలియదు.. ఎన్నిసార్లు రాజీనామా చేసినా గెలిచా..
నాకు ఓటమి అనేది తెలియదు.. ఎన్నిసార్లు రాజీనామా చేసినా గెలిచా.. అని ఈటల రాజేందర్ అన్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా ప్రకటించిన అనంతరం మీడియా ముందు కీలక విషయాలు వెల్లడించారు.
-
బెంజ్ కారులో వెళ్లి రైతు బంధు తీసుకునేవారికి పథకాలా..?
బెంజ్‌కారులో వెళ్లి రైతు బంధు పథకాలను తీసుకునేవారికి పథకాలు వస్తున్నాయని, నిరుపేదలకు ఎలాంటి పథకాలు రావడం లేదని ఈటల రాజేందర్ ఆరోపించారు.
-
-
రెండేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు
రెండేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ముఖ్యమంత్రికి చ ఎప్పి ఇప్పిస్తానని చెప్పాను. అయిన ఇంత వరకు కార్డులు జారీ కాలేదు. సంక్షేమ పథకాలను నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు.
-
సీఎంవో కార్యాలయంలో ఒక్క ఎస్సీ, ఎస్టీనైనా ఉన్నారా?
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు.
-
రాష్ట్రం కోసమే అవమానాలు భరించాం
రాష్ట్రం కోసమే అవమానాలు భరించామని ఈటల రాజేందర్ అన్నారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్‌లు లేరు. వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.
-
బానిసకంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకు
బానిసకంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకు ఈటల రాజేందర్ అన్నారు. హరీష్‌రావుకు కూడా అవమానం జరిగింది. ప్రగతి భవన్ అంటే బానిస భవన్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
-
19 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో ఉన్నా..
19 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్‌లో ఉన్నా.. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు. డబ్బులు, కుట్రలతో ఉప ఎన్నికలలో అధికార పార్టీ గెలుపొందవచ్చు అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు రెండు సార్లు ప్రయత్నించినా.. కానీ అవకాశం ఇవ్వలేదని ఈటల అన్నారు.
-
నాపై జరుగుతున్న దాడిలపై ప్రజలు ఆవేదన చెందుతున్నారు
ఓ అనామకుడు ఉత్తరం రాస్తే మంత్రిపై చర్యలు తీసుకున్నారని అన్నారు. నాపై జరుగుతున్న దాడి, కుట్రలపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై చర్యలు సిద్ధమయ్యారు.
-
ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ సభ్యత్వానికి రాజీనామా
అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
-
నా ప్రాణం ఉండానే బొందబెట్టాలని చూశారు
హుజూరాబాద్‌లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నామని అన్నారు.శిక్షపడే ఖైదీకి చివరి కోరిక ఏంటని అడుగుతారు. అలాంటిది నా గురించి ఏం తెలుసుకోకుండా విచారణకు ఆదేశించారు. నన్ను ప్రాణం ఉండగానే బొందబెట్టాలని ఆదేశాలు ఇచ్చారు.
-
రాత్రికి రాత్రే బర్తరఫ్ చేశారు- ఈటల
రాత్రికి రాత్రే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఉరిశిక్ష పడే ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా విచారణకు ఆదేశించారు.
-
మీడియాతో మాట్లాడుతున్న ఈటల
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. పార్టీకి, ఎమ్మెల్యేకు రాజీనామాపై నిర్ణయం ప్రకటించనున్నారు.
-
పార్టీ వీడటంపై అనుచరుల అభిప్రాయాలు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం నిన్న హైదరాబాద్‌కు వచ్చిన ఈటెల అనుచరులతో భేటీ పార్టీ వీడటంపై వారి అభిప్రాయాలు పంచుకున్నారు
-
కొద్ది సేపట్లో ఈటల మీడియా సమావేశం
కొద్ది సేపట్లో ఈటల రాజేందర్ మీడియా ముందుకు రానున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల.. పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
Published On - Jun 04,2021 11:23 AM