TRS Tickets: వారసుల కోసం తల్లిదండ్రుల పాట్లు.. పిల్లల కోసం అప్పుడే కేసీఆర్‌కు టీఆర్ఎస్ నేతల దరఖాస్తులు!

మాదేముంది అన్ని చూసాం.. ఇక మా వారసులకు అవకాశం ఇవ్వండి.. మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా సరే మా పుత్రులకు మాత్రం టిక్కెట్ హామీ ఇవ్వండి.. కుదిరితే ఎమ్మెల్యే లేదంటే ఎంపీ.. అది కాకుంటే ఎమ్మెల్సీ..

TRS Tickets: వారసుల కోసం తల్లిదండ్రుల పాట్లు.. పిల్లల కోసం అప్పుడే కేసీఆర్‌కు టీఆర్ఎస్ నేతల దరఖాస్తులు!
Trs President Cm Kcr

TRS leaders for Children’s tickets: మాదేముంది అన్ని చూసాం.. ఇక మా వారసులకు అవకాశం ఇవ్వండి.. మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా సరే మా పుత్రులకు మాత్రం టిక్కెట్ హామీ ఇవ్వండి.. కుదిరితే ఎమ్మెల్యే లేదంటే ఎంపీ.. అది కాకుంటే ఎమ్మెల్సీ.. ఇలా ఏదో ఒకటి కానీ ఈసారి మవాళ్లకు అవకాశం ఇవ్వండి.. ఎలాగైనా మా కుటుంబం నుంచి బరిలోకి దించాల్సిందే. ఇది ఇప్పుడు అధికార పార్టీలో కొంత మంది ముఖ్య నాయకులు గులాబీ పెద్దల దగ్గర పెడుతున్న ప్రపోజల్స్ ఇవీ..

తెలంగాణ రాజకీయాల్లో ఇది అది అని కాదు అన్ని పార్టీల్లో చాలా కాలం అందరూ నాయకులకు ‘సన్’ స్ట్రోక్ తప్పడం లేదు.. మీరు రాజకీయాలు చేసింది చాలు.. ఇక, మా రాజకీయ ప్రవేశం దృష్టి పెట్టండి అంటూ అందరి నాయకుల వారసులు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే, అన్ని పార్టీల సంగతి పక్కన బెడితే అధికార టీఆర్ఎస్‌లో మాత్రం చాలా మంది సీనియర్ నాయకులు తమతమ బిడ్డల రాజకీయ భవిష్యత్‌‌పై సీరియస్‌గానే ఫోకస్ పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారుసులకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు, ఇప్పటి నుంచే గులాబీ బాస్ దగ్గర లాబీయింగ్ మొదలు పెట్టారట..

నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన కుమారుడికి టిక్కెట్ కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి ఈ మధ్యన ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ప్రస్తావనకు తీసుకురాగా ఆయనకు హామీ వచ్చినట్టు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా భారీగానే స్కెచ్ వేసుకున్నారు. ఆయన కొడుకుతో పాటు ఆయన అన్న కొడుకును కూడా ఎన్నికల బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరో వైపు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కుమారుల్లో కార్తీక్ రెడ్డి ఇప్పటికే యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండగా, మిగిలిన వాళ్ల ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సైతం తన కుమారుడిని నియోజకవర్గంలో గట్టిగానే ప్రమోట్ చేస్తుండగా, అటు మేడ్చల్ నుండి మంత్రి మల్లారెడ్డి తన కొడుకు మహేందర్ రెడ్డి కోసం అప్పడే ప్రయత్నాలు మెదలు పెట్టినట్లు పార్టీవర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.

ఇక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కూతురు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక హోంమంత్రి మహమూద్ అలీ తన కుమారుడికి ఎదోక పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు అన్ని జిల్లాల్లోని సీనియర్ నాయకులు తాము యాక్టివ్‌గా ఉన్నపుడే తమ వారసులను ఎదో ఒక పదవిలో కూర్చోబెడితే బెటర్ అని భావిస్తున్నారు. ఇక, వారి లైఫ్ పొలిటికల్ ట్రక్‌లో పడితే ఇక తాము రిలాక్స్ అవ్వచ్చని బావిస్తున్నారేమో.. అయితే, దానికి రానున్న సార్వత్రిక ఎన్నికలే కరెక్ట్ అని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను ఇప్పటి నుంచే ప్రసన్నం చేసుకుంటున్నట్లు సమాచారం. చూడాలి మరీ, అధినేత ఏ మేరకు వారసులకు అవకాశం ఇస్తారో…

— శ్రీధర్ ప్రసాద్, టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్.

Read Also… 

Punam Kaur: డ్రగ్స్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్‌ కౌర్‌.. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానంటూ.

Click on your DTH Provider to Add TV9 Telugu