Punam Kaur: డ్రగ్స్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్‌ కౌర్‌.. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానంటూ.

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Sep 03, 2021 | 1:33 PM

Drugs Case: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్‌ వ్యవహారం షేక్‌ చేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీ, నటులు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఆఫీసుకు క్యూ కడుతున్నారు...

Punam Kaur: డ్రగ్స్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్‌ కౌర్‌.. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానంటూ.
Punam Twitter

Follow us on

Drugs Case: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్‌ వ్యవహారం షేక్‌ చేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీ, నటులు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఆఫీసుకు క్యూ కడుతున్నారు. దీంతో టాలీవుడ్‌లో డ్రగ్స్‌ టాపిక్‌ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌, నటీమణులు ఛార్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పేర్లు వినిపిస్తాయోనని సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. ఇదిలా ఉంటే ఈ అంశంపై ప్రస్తుతం ఎవరూ బాహాటంగా స్పందించడానికి ఇష్టపడడంలేదు. అయితే డ్రగ్స్‌ అంశంపై టాలీవుడ్‌లో తొలిసారి నటి పూనమ్‌ కౌర్‌ స్పందించారు.

నిత్యం కాంట్రవర్సీ స్టేట్‌మెంట్‌లతో, ట్వీట్‌లతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారే పూనమ్‌ కౌర్‌ తాజాగా డ్రగ్స్‌ విషయమై ట్విట్టర్‌ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘డ్రగ్స్‌ అనేది కేవలం సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతీ ఒక్కరి సమస్య. ఇది ఒక సరిహద్దు సమస్య, ఇది రాజకీయ ప్రేరణతో జరుగుతోన్న వ్యవహారం, ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య, డ్రగ్స్‌ అంశంపై త్వరలోనే నా స్వీయ అనుభవాలను  మీతో పంచుకుంటాను’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. దీంతో పూనమ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ పూనమ్‌కు ఎదురైన ఆ అనుభవం ఏంటన్న దానిపై చర్చ మొదలైంది. మరి పూనమ్‌ ఎలాంటి బాంబు పేల్చనుందో చూడాలి.

పూనమ్ చేసిన ట్వీట్..

Also Read: బిగ్ బాస్ 5: ఈ ఐదు కంటెస్టెంట్లదే అత్యధిక రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anushka Sharma: ఓవల్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్ల భార్యలు సందడి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Tuck Jagadish: టక్‌ జగదీష్ సినిమా కొత్త పాట విడుదల.. శివ నిర్వాణ ఈ పాటను ఎలా పాడారో విన్నారా.?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu