Telangana Politics: సీఎం కేసీఆర్ ఏమన్నారు?.. విపక్ష నేతల దుమ్ము దులిపిన మోత్కుపల్లి..

Telangana Politics: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై(Cm Kcr) బీజేపీ నేతలు విమర్శలు చేయడంపై టీఆర్ఎస్(Trs) నేత మోత్కుపల్లి నర్సింహులు..

Telangana Politics: సీఎం కేసీఆర్ ఏమన్నారు?.. విపక్ష నేతల దుమ్ము దులిపిన మోత్కుపల్లి..
Mothkupalli Narsimhulu
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 04, 2022 | 2:27 PM

Telangana Politics: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై(Cm Kcr) బీజేపీ నేతలు విమర్శలు చేయడంపై టీఆర్ఎస్(Trs) నేత మోత్కుపల్లి నర్సింహులు(Mothkupalli Narsimhulu) తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్(Telangana CM) ఏమన్నారని ప్రతిపక్ష నేతలు బట్టలు చింపుకుంటున్నారని ప్రశ్నించారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ వాళ్ళు అయితే బట్టలు చింపుకొని మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన.. రైతు చట్టాలపై మోడీ క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానిగా ఉండే అర్హత కోల్పోయాడన్నారు. మోడీ ఆరోజే రాజీనామా చేయాల్సిందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాల హక్కులపై పోరాటం చేసే అవసరం ఎందుకు వచ్చిందన్నారు. విభజన హామీలు ఎటు పోయాయని ప్రశ్నించారు. ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదని, తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తి వివక్ష ప్రదర్శిస్తుందన్నారు.

‘‘బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ ఎటు పోయింది? రైలు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయిందో ఈ వెధవ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉందా లేదా?’’ అంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు మోత్కుపల్లి నర్సింహులు. జాతీయ స్థాయిలో ఎదుగుతున్న సీఎం కేసీఆర్‌ను అణచివేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. ‘‘మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నందున ఇవాళ నిధులు అన్నీ మీరు పాలించే రాష్ట్రాలకే ఇస్తే పోరాటం చేయడంలో తప్పేముంది. తెలంగాణలో కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘దళిత బంధు ఇస్తున్న సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే.. మీరు ఎంత దుర్మార్గపు మనుషుల్లో అర్థం అవుతుంది. దళితుల మీద మీకు ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఎందుకు దళిత బంధు ఇవ్వడం లేదు. ఇచ్చే దమ్ము మీకు ఉందా? దళితలకు న్యాయం చేసే దమ్ము దైర్యం మీకు ఉందా? కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకుంటే కబడ్దార్ మిస్టర్ బండి సంజయ్.’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మోత్కుపల్లి.

‘‘నేను దళిత బంధు పోగ్రామ్‌లో కూర్చుంటే ఎంతో సంతోషంగా ఉంది. రేపటి బడ్జెట్‌లో దళిత బంధు కోసం రూ.20 వేల కోట్లు పెట్టబోతున్నారు సీఎం కేసీఆర్. దళితులను అవమాన పరిచే మీరు దళితలకు న్యాయం ఎక్కడ చేస్తారు.? ఆదర్శవంతంగా పాలన చేస్తుంటే ఓర్వలేక పోతున్నారు.’’ అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరును తూర్పారబట్టారు.

Also read:

Liger Movie: ఫైనల్ షెడ్యూల్‌కు సిద్ధమైన లైగర్.. నెట్టింట్లో ఫొటోలు షేర్ చేసిన చార్మి..

Audi SUV Q7: లగ్జరీ కార్ల కంపెనీ ఆడీ నుంచి మరో కారు.. అత్యాధునిక ఫీచర్స్‌

Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ.. ఆ విషయంపైనే ప్రధానంగా చర్చ..