న్యాయవాదుల సంక్షేమానికి టీఆర్ఎస్ కృషి
నిజామాబాద్: గత ఐదేళ్లుగా న్యాయవాదుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత పేర్కొన్నారు. నగరంలోని బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని కవిత హామీ ఇచ్చారు. హైకోర్టు విభజనతో పరిస్థితులు మారాయని, వసతుల కల్పన చేపడుతున్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రమేశ్, అసోషియేషన్ సభ్యులు ఆమెను సన్మానించారు.