కేంద్రంలో మన మాటే నెగ్గాలి- కేసీఆర్
మహబూబాబాద్: దేశాన్ని 66 ఏళ్ల పాటు కాంగ్రెస్, బీజేపీలే పరిపాలించాయని.. వారి పాలనలో జరిగింది మాత్రం శూన్యమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గురువారం మహబూబాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో 16 సీట్లు టీఆర్ఎస్ కు రావాలని.. కేంద్రంలో రాష్ట్రాల మాటలు చెల్లుబాటయ్యే ప్రభుత్వం ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీకి చేసే అవకాశమున్నా ఆయన కూడా పేదలకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. సీతారాం నాయక్‌కు టికెట్ ఇవ్వకపోవడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని.. […]

మహబూబాబాద్: దేశాన్ని 66 ఏళ్ల పాటు కాంగ్రెస్, బీజేపీలే పరిపాలించాయని.. వారి పాలనలో జరిగింది మాత్రం శూన్యమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గురువారం మహబూబాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో 16 సీట్లు టీఆర్ఎస్ కు రావాలని.. కేంద్రంలో రాష్ట్రాల మాటలు చెల్లుబాటయ్యే ప్రభుత్వం ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీకి చేసే అవకాశమున్నా ఆయన కూడా పేదలకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. సీతారాం నాయక్‌కు టికెట్ ఇవ్వకపోవడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని.. ఆయనకు పార్టీలో ఎప్పటిలాగే తగిన గౌరవం ఉంటుందన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.
త్వరలో రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు చేస్తామని తెలిపారు. గిరిజనుల బతుకుల్లో వెలుగులు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చిన కేసీఆర్.. తాగునీరు సమస్య మిషన్ భగీరథతో తీరనుందని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామని తెలిపారు. ఆరునూరైనా దేశానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు.
