Traffic Jam: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్.. పంతంగి, చౌటుప్పల్ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు..
యాదాద్రి భువనగిరి జిల్లా విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు చౌటుప్పల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి...
పండుగ వచ్చిదంటే చాలు పట్నంలో ఉన్న పల్లెటూరికి చెందిన వారు పల్లె బాట పడతారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో వివిధ ప్రాంతల నుంచి వచ్చి ఉపాధి పొందుతారు. లక్షల మందికి ఈ భాగ్యనగరం ఆశ్రయం ఇస్తుంది. దసరా పండుగతో వీరంతా వారి సొంత ఊళ్లుకు వెళ్లారు. వెళ్లిన వారు పండుగకు రెండు రోజుల ముందుగా కొందరు, పండుగ రేపు అనగా కొందరు వాళ్ల ఊళ్లకు వెళ్లారు. వెళ్లేటప్పుడు దఫదఫాలుగా వెళ్లిన వారు పండుగ అయిపోగానే ఒకేసారి రావటంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
యాదాద్రి భువనగిరి జిల్లా విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు చౌటుప్పల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ చేరుకుంటుండంతో జాతీయరహదారి కిక్కిరిసిపోయింది. దాదాపు అందరికీ సెలవులు ఇవాళ్టి వరకే కావటంతో పండక్కి ఊరెళ్లిన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉదయం నుంచే హైదరాబాద్ పయనమవడంతో విజయవాడ, హైదరాబాద్ మార్గంలో రద్దీ అధికమైంది. చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ రావడానికి గంట పైగా సమయం పడుతున్నట్లు వాహనదారులు చెబుతున్నారు.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌటుప్పల్‌లో అండర్‌పాస్ వంతెన లేకపోవడంతో పండుగ వేళ, శుభకార్యాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. అయితే కరోనా భయంతో చాలా మంది తమ సొంత వాహనాల్లో ఊరు వెళ్లారు. దీంతో వాహనాలు అధికం కావడం కూడా ట్రాఫిక్ జామ్ ఒక కారణంగా చెప్పొచ్చు. ఈ ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. దసరా పండుగ సీజన్లో టోల్ ప్లాజాకు భారీ ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also.. TRS Party Meeting: రానున్న రోజుల్లో మనమే కీలకం కాబోతున్నాం.. లోక్‌సభ స్థానాలపై స్పందించిన కేసీఆర్