TRS Party Meeting: రానున్న రోజుల్లో మనమే కీలకం కాబోతున్నాం.. లోక్‌సభ స్థానాలపై స్పందించిన కేసీఆర్‌

TRS Party Meeting: ఇక ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో నిర్వహించగా.. సాయంత్రం 5.45 కి ముగిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, హె..

TRS Party Meeting: రానున్న రోజుల్లో మనమే కీలకం కాబోతున్నాం.. లోక్‌సభ స్థానాలపై స్పందించిన కేసీఆర్‌
Follow us

|

Updated on: Oct 17, 2021 | 7:17 PM

TRS Party Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం తెలంగాణ భవన్‌లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్తంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్‌ సభ్యులనుద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా లోక్‌ సభ స్థానాలపై కేసీఆర్‌ స్పందించారు. రానున్న కేంద్ర రాజకీయాల్లో మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. లోక్ సభలో మనమే కీలకం కాబోతున్నామని వ్యాఖ్యానించారు. లోక్‌ సభ స్థానాలపై మరింత దృష్టి పెట్టాలని, మన స్థానాలు పెరగాలని అన్నారు. ఇక ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో నిర్వహించగా.. సాయంత్రం 5.45 కి ముగిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, హెచ్‌ఐసీసీలో అక్టోబర్ 25వ తేదీన నిర్వహించనున్న ప్లీనరీ, అలాగే, వచ్చే నెల 15న వరంగల్‌లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇదిలా ఉండగా.. నేటి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.

ఈనెల 23న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన.. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 25 హైటెక్స్‌లో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. నేటి నుంచి 22 తేదీవరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ భవన్‌లో నామినేషన్లు స్వీకరించునున్నారు.

ప్రతిపక్షాలకు దిమ్మదిరిగేలా ప్రజాగర్జన సభ:

కాగా, ప్రతి పక్షాలకు దిమ్మదిరిగేలా ప్రజాగర్జన సభ ఉంటుందని కేసీఆర్‌ ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ప్రతి రోజు 20 నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను తెలంగాణ భవన్‌లో నిర్వహించాలన్నారు. ఈ నెల 15న వరంగల్‌ ప్రజాగర్జన సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. సందర్భంగా పలు అంశాలపై సీఎం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్‌ సభ్యులు, నేతల ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. హుజరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు.

ఇవీ కూడా చదవండి:

Huzurabad By Election: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో మనదే గెలుపు.. 27న భారీ సభ: సీఎం కేసీఆర్‌

Navjot Singh Sidhu: ఇదే లాస్ట్‌ ఛాన్స్‌.. సద్వినియోగం చేసుకుందాం.. అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు పంజాబ్‌ పీసీసీ చీఫ్‌

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..