AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అడ‌వి బిడ్డ‌లు.. స్మశానాన్ని ఐసోలేషన్ సెంట‌ర్‌గా మార్చుకున్నారు.. .అధికారులు వద్దంటున్నా

సాధారణంగా స్మశానం వైపు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది.. ఏకంగా స్మశానంలోనే జీవనం సాగించాలంటే...ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా..

Telangana: అడ‌వి బిడ్డ‌లు..  స్మశానాన్ని ఐసోలేషన్ సెంట‌ర్‌గా మార్చుకున్నారు.. .అధికారులు వద్దంటున్నా
Isolation At Burial Ground
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2021 | 4:16 PM

Share

సాధారణంగా స్మశానం వైపు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది.. ఏకంగా స్మశానంలోనే జీవనం సాగించాలంటే…ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా.. కానీ, స్మశాన వాటికే అక్క‌డివారికి ఐసోలేషన్ సెంటర్.. అడవుల నుండి వచ్చే గాలే వీరికి ఆక్సిజన్ అంటున్నారు అశ్వరావుపేట మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన మొద్దులమాడ గ్రామస్తులు. చేపల వేటకు వెళ్లిన 50మంది గిరిజనులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు.. వెంటనే వారికి ఒక ఆలోచన వచ్చింది. స్మశాన వాటికను ఐసోలేషన్ వార్డుకింద మార్చుకొని నాలుగు రోజుల నుంచి వారంతా వైకుంఠధామంలోనే జీవనం సాగిస్తున్నారు. మృతదేహాలను కాల్చడానికి ఉపయోగించే కట్టెలతో వంటావార్పు చేసుకుంటున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన మొద్దులమాడ గ్రామంలో వారం రోజుల క్రితం గ్రామస్తులంతా కలిసి చేపలు పట్టేందుకు వెళ్లారు.. మరుసటి రోజు ఆ గ్రామంలో వరుసగా జ్వరాలు రావడంతో అధికారులు కరోనా పరీక్షలు చేయించారు. సుమారు 50 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాదాపుగా ఇంటికి ఒకరు కరోనా భారిన పడ్డారు. దీనితో ఇతరులకు వ్యాధి సోకకుండా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇంతమందికి ఒకేసారి కరోనా రావడంతో ఎవరింట్లో వారు ఉండే పరిస్థితి లేదు. దీనికి తోడు వేల ఖర్చులు పెట్టుకుని ఇతర ప్రాంతాలకు ఐసోలేషన్ సెంటర్ కు వెళ్లే అవకాశాలు లేకపోవడంతో తమ గ్రామంలోనే ఉన్న విశాలమైన స్మశానవాటికను ఐసోలేషన్ సెంటర్ గా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఉంటూ సాముహిక భోజనాలు వండుకుని తింటున్నారు. కాగా వీరికి కుటుంబసభ్యులతో పాటు గ్రామపెద్దలు సహాయం చేస్తున్నారు. విషయం జిల్లా కలెక్టర్‌కు చేరింది. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ వారిని ఐసోలేషన్‌కు తరలించి వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే గిరిజనం మాత్రం అందుకు అంగీకరించలేదు. తమకు స్మశానంలోనే బాగుందని బదులు చెప్పారు. అక్కడే హాయిగా ఉంటున్నామని తెలిపారు. ఒప్పుకున్న‌వారిని మాత్రం అధికారులు వేరే ఐసోలేష‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. గిరిజనులు స్మశాన వాటికను ఐసోలేషన్ సెంటర్ గా మార్చుకోవడంపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Also Read: మ‌న‌సును క‌దిలించే వీడియో.. యజమానికి అస్వ‌స్థ‌త‌.. అంబులెన్సు వెంట పరుగులు తీసిన శునకం

ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి