Viral Video: మ‌న‌సును క‌దిలించే వీడియో.. యజమానికి అస్వ‌స్థ‌త‌.. అంబులెన్సు వెంట పరుగులు తీసిన శునకం

కాస్తంత కేర్ చూపించి.. స‌మయానికి ఫుడ్ పెడితే చాలు.. శున‌కాలు ఓ రేంజ్‌లో విశ్వాసం చూపిస్తాయి. కొంత‌మంది అయితే పెట్ డాగ్స్‌ను ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లా...

Viral Video: మ‌న‌సును క‌దిలించే వీడియో.. యజమానికి అస్వ‌స్థ‌త‌..  అంబులెన్సు వెంట పరుగులు తీసిన శునకం
True Companion Dog
Follow us

|

Updated on: Jun 12, 2021 | 3:57 PM

కాస్తంత కేర్ చూపించి.. స‌మయానికి ఫుడ్ పెడితే చాలు.. శున‌కాలు ఓ రేంజ్‌లో విశ్వాసం చూపిస్తాయి. కొంత‌మంది అయితే పెట్ డాగ్స్‌ను ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లా ట్రీట్ చేస్తారు. వాటితో గ‌డిపేందుకు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తారు. దీంతో అవి కూడా య‌జ‌మానుల‌పై అంతే ప్రేమ పెంచుకుంటాయి. శున‌కాల విశ్వాసానికి సంబంధించిన ఘ‌ట‌న‌లు నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా టర్కీలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అనారోగ్యం కారణంగా యజమానిని అంబులెన్స్​లో తరలిస్తున్న సమయంలో.. దాని వెంటే పరిగెత్తింది ఓ శునకం. యజమాని కోసం పరితపించిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్​గా మారింది.

అస‌లేం జ‌రిగిందంటే…

టర్కీలోని ఇస్తాంబుల్​లో ఓ మహిళ ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. కొన్ని రోజులు ఆమె ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. ప‌రిస్థితి కాస్త ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌టంతో ఆస్పత్రిలో చేర్చడం కోసం అంబులెన్సు ఇంటికి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్సులోకి ఎక్కేందుకు గోల్డెన్ రిట్రీవర్ (శునకం జాతి) ప్రయత్నించగా, పలు కారణాలతో దానిని స్టాఫ్ అనుమతించ‌లేదు. అయితే, యజమానికి ఏమవుతుందో అన్న ఆందోళ‌న‌తో అంబులెన్సు వెంటే పరుగుపెట్టింది గోల్డెన్ రిట్రీవర్. ఆమెను ఆస్పత్రికి లోపలికి తీసుకెళ్లాక.. ఎంట్రీ గేటు దగ్గరే చాలాసేపు ఎదురుచూసింది. శునకం త‌న ఓన‌ర్‌పై చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. త్వ‌ర‌లోనే ఆ శున‌కం క్షేమంగా త‌న య‌జ‌మానిని చేరుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

Also Read: ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి

నకిలీ విత్త‌నాలు త‌యారుచేసే కంత్రీగాళ్ల భ‌ర‌తం ప‌డ‌తాం.. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సీరియ‌స్ వార్నింగ్