AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad ORR Alert : వాహనదారులకు గమనిక..! కోకకోలా జంక్షన్ నుంచి ట్రాఫిక్ మళ్లింపు.. ఎప్పటి నుంచి అంటే..?

Hyderabad ORR Alert : హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు మరమ్మతుకి సంబంధించి వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు.

Hyderabad ORR Alert : వాహనదారులకు గమనిక..! కోకకోలా జంక్షన్ నుంచి ట్రాఫిక్ మళ్లింపు.. ఎప్పటి నుంచి అంటే..?
Hyderabad Orr Alert
uppula Raju
|

Updated on: Jun 12, 2021 | 6:01 PM

Share

Hyderabad ORR Alert : హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు మరమ్మతుకి సంబంధించి వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు. కోకకోలా జంక్షన్ నుంచి బాచుపల్లి వరకు గల రోడ్డుకు రేపటి నుంచి మరమ్మతు పనులు జరుగుతాయి. ఈ పనులు 60 రోజులు కొనసాగుతాయి. అంటే 13.06.2021 నుంచి 13.08.2021 వరకు జరుగుతాయి. కనుక ఇటువైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తారు. ప్రతి రోజు రాత్రి 11గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రోడ్డు పనులు జరుగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

1. సాయికృష్ణజా హిల్స్ కాలనీ నుంచి కోక కోలా జంక్షన్‌కు వచ్చే ట్రాఫిక్ వోల్వో సర్వీస్ రోడ్ నుంచి బాచుపల్లి రహదారికి మళ్లించబడుతుంది. కోక కోలా జంక్షన్ వద్ద పనులు జరుగుతున్నాయి. 2. కౌసల్య కాలనీ నుంచి బచుపల్లి రహదారికి వచ్చే ట్రాఫిక్ సూర్య అకాడమీ పాఠశాల ద్వారా మియాపూర్ రోడ్ వైపుకు మళ్ళించబడుతుంది. కౌసల్య కాలనీ జంక్షన్ వద్ద పనులు పురోగతిలో ఉన్నాయి. కనుక వాహనదారులు, ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.