TS Gurukulam Exam Dates: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. గురుకుల టీచర్‌ కొలువులకు పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌..

TS Gurukulam Teacher Exam Dates: తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో టీచర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష తేదీలను నియామక బోర్డు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని నియామక బోర్డు (TREIRB) కార్యనిర్వాహక..

TS Gurukulam Exam Dates: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. గురుకుల టీచర్‌ కొలువులకు పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌..
Ts Gurukulam Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 16, 2023 | 9:43 PM

TS Gurukulam Teacher Exam Dates: తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో టీచర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష తేదీలను నియామక బోర్డు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని నియామక బోర్డు (TREIRB) కార్యనిర్వాహక అధికారి మల్లయ్య బట్టు గురువారం (జూన్‌ 15) తెలిపారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రకటన జూన్ 17న ప్రకటించనున్నట్లు తెలిపారు. జేఎల్, డీఎల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న విషయం తెలిసిందే.

కాగా రాష్ట్రంలోని గురుకుల సొసైటీల పరిధిలో 9 నోటిఫికేషన్ల ద్వారా దాదాపు 9,210 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్‌ 5న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి ఏప్రిల్‌ 14 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 2,63,045 వరకు దరఖాస్తులు అందాయి. వీటిల్లో 1.6 లక్షల దరఖాస్తులు టీజీటీ, పీజీటీ పోస్టులకు కలిపి రావడం విశేషం. ఇక నియామక పరీక్షలను తొలుత ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించాలని బోర్డు భావించినప్పటికీ లీకుల నేపథ్యంలో సీబీఆర్‌టీ విధానమే బెస్ట్‌ అని నిర్ణయించింది. వేగంగా పరీక్షలు నిర్వహించి, ఆ త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు 9,210

విభాగాల వారీగా పోస్టుల వివరాలు ఇవే..

  • టీజీటీ పోస్టులు: 4,006
  • మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులు: 123
  • క్రాఫ్ట్‌ టీచర్ పోస్టులు: 88
  • ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు: 275
  • లైబ్రేరియన్‌ పోస్టులు: 434
  • ఆర్ట్‌ టీచర్‌ పోస్టులు: 132
  • పీజీటీ పోస్టులు: 1,276
  • జేఎల్ పోస్టులు: 2,008
  • డీఎల్ పోస్టులు: 868

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?