Heart Attack: ఉద్యోగం వచ్చిందని రాత్రి స్వీట్లు పంచాడు.. తెల్లారేసరికి గుండెపోటుతో..!
ఈ మధ్య గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో 60 ఏళ్లకు పైబడినవారికి మాత్రమే గుండెపోటు వచ్చే ముప్పు అధికంగా ఉండగా.. ప్రస్తుతం 13 ఏళ్ల చిన్నారులు కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ మధ్య గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో 60 ఏళ్లకు పైబడినవారికి మాత్రమే గుండెపోటు వచ్చే ముప్పు అధికంగా ఉండగా.. ప్రస్తుతం 13 ఏళ్ల చిన్నారులు కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నడుస్తూ.. నవ్వుతూ.. ఆడుతూ.. పాడుతూ.. ఇలా ఆకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. తాజాగా గుండెపోటు కారణంగా ఓ బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అతడికి ఉద్యోగం రాగా.. రాత్రి అందరికి స్వీట్లు పంచాడు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. ఉదయం ఎంత సేపటికి కుమారుడు లేవకపోవటంతో తల్లి వెళ్లి కుమారుడని నిద్రలేపేందుకు ప్రయత్నించింది. అయితే అతను అచేతనంగా పడి ఉండటంతో ఆందోళకు గురైన వారు.. అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నిద్రలోనే గుండెపోటు రావటంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఉద్యోగం వచ్చిందంటూ ఎంతో సంతోషంతో అందరికీ స్వీట్లు పంచిన కొడుకు.. కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపించారు. వారి రోదనలతో ఆసుపత్రి ప్రాగంణంలో విషాదం అలుముకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!