Elephant: ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది..బీ కేర్‌ఫుల్..! వీడియో.
నుషులు కొన్ని జంతువులపై తమ ప్రేమ, ఆప్యాయతను చూపిస్తారు. అవి కూడా వారిపై ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. కానీ వాటిని ఇబ్బంది పెడితే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. ముఖ్యంగా అడవిలో ఉండే జంతువులతో పెట్టుకుంటే మాత్రం ప్రాణాలకే ముప్పు కొనితెచ్చుకున్నవారవుతారు.
మనుషులు కొన్ని జంతువులపై తమ ప్రేమ, ఆప్యాయతను చూపిస్తారు. అవి కూడా వారిపై ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. కానీ వాటిని ఇబ్బంది పెడితే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. ముఖ్యంగా అడవిలో ఉండే జంతువులతో పెట్టుకుంటే మాత్రం ప్రాణాలకే ముప్పు కొనితెచ్చుకున్నవారవుతారు. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న ఓ అడవిలోకి ఓ వక్తి ప్రవేశించాడు. అక్కడ ఓ ఏనుగు ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటోంది. ఇంతలో అతను వచ్చి ఆ ఏనుగును ఇబ్బంది పెట్టాడు. దాన్ని ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అతను తనపై దాడి చేయడానికి యత్నిస్తున్నాడనుకుందో ఏమో.. ఒక్కసారిగా ఏనుగు అతనివైపు దూసుకొచ్చింది. అతన్ని కొద్దిదూరం వరకు వెంబడించింది. ఏనుగు వెంబడించడంతో ఆ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లగెత్తాడు. అలా పరిగెత్తుంచూ రోడ్డుపైకి వచ్చాడు. అతడ్ని రక్షించేందుకు అక్కడున్న టూరిస్టులు, స్థానికులు ఏనుగును బెదిరిస్తూ శబ్దాలు చేశారు. దీంతో ఆ ఏనుగు వెనక్కి తగ్గింది. అతడ్ని వెంబడించడం ఆపి.. తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఏనుగును ఆటంకపరిచినందుకు చివరికి అతనికి 40 వేల రూపాయల జరిమాన వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!