Adipurush Dialogue Removed: ఆదిపురుష్‌లో ఆ డైలాగ్ అవుట్.. ఆ దేశంతో లొల్లెందుకు..?
పురాణాలు.. నమ్మకాలు.. దేవుళ్లు.. ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. రూపాతరం చెందుతుంటాయి. ఇక రామాయణం విషయంలోనూ.. అదే జరిగింది. అందుకే అందరి మనోభావాలను గౌరవిస్తూ... ఆదిపురుష్ సినిమాలోని ఓ కీ డైలాగ్‌ను... తొలిగించారు ఈ మూవీ మేకర్స్ .
పురాణాలు.. నమ్మకాలు.. దేవుళ్లు.. ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. రూపాతరం చెందుతుంటాయి. ఇక రామాయణం విషయంలోనూ.. అదే జరిగింది. అందుకే అందరి మనోభావాలను గౌరవిస్తూ… ఆదిపురుష్ సినిమాలోని ఓ కీ డైలాగ్‌ను… తొలిగించారు ఈ మూవీ మేకర్స్ . తొలిగించడమే కాదు… తాము తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఓ దేశంలో మనుగడలో ఉన్న నమ్మకాన్ని గౌరవించారు. ఇంతకీ ఆ దేశమేంటి..? వారి నమ్మకమేంటి..? తొలిగించిన ఆ డైలాగ్ ఏంటి? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ప్రభాస్ హీరోగా.. ఓ రౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ.. రామాయణంలో ఆరణ్య కాండకు దృష్య రూపం. అయితే వాల్మీకీ రామాయణం ప్రకారం.. సీతా దేవీ.. మిథిలా రాజ్య రాజైన జనకుడి కుమార్తె. ఇక ఒకప్పటి మిథిలా రాజ్యం ఇప్పటి ఉత్తర బీహార్ లో ఉంది. దీంతో.. సీతా దేవీ జన్మ స్థానంగా… ఉత్తర భారదేశమనే అందరూ నమ్ముతుంటారు. కానీ మన పొరుగునున్న నేపాల్లో మాత్రం సీతాదేవీ… నేపాల్ గడ్డపై పుట్టినట్టు స్థానికులు నమ్ముతుంటారు. సీతాదేవిని ప్రముఖంగా కొలుస్తుంటారు. దీంతో వారి నమ్మకాన్ని అగౌరపరచకుండా… నేపాల్లో రిలీజ్ అయ్యే ఆదిపురుష్ ఫైనల్ కాపీలో.. సీతా దేవీ.. భరత ఖండంలో పుట్టినట్టు ఉన్న డైలాగ్‌ను తీసేశారట మేకర్స్. నేపాలీల మనోభావాలను దెబ్బతీయడం ఇష్టం లేక.. ఇరే దేశాల మధ్య ఇదో ఇష్యూగా మారకుండా… నేపాలీ సెన్సార్ బోర్ట్ సూచనల మేరకు… ఇలా చేశారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!