Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallu Ravi : అన్ని జిల్లాల్లో దళిత బంధు స్కీం అమలు చేయాలి : మల్లు రవి

'దళిత బంధు' పేరుతో సీఎం కేసీఆర్‌కి క్షీరాభిషేకం చేయడం ఎంతవరకు సమంజసం అని టిపిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రిని..

Mallu Ravi : అన్ని జిల్లాల్లో దళిత బంధు స్కీం అమలు చేయాలి : మల్లు రవి
Mallu Ravi
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 20, 2021 | 9:56 PM

TPCC Vice president – Mallu Ravi – Dalita Bandhu : ‘దళిత బంధు’ పేరుతో సీఎం కేసీఆర్‌కి క్షీరాభిషేకం చేయడం ఎంతవరకు సమంజసం అని టిపిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే తల నరుక్కుంటా ఉన్న వీడియో ఇప్పటికీ ప్రజలు చూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లో ఉన్న నిధులను కూడా దారి మళ్లించారని ఆరోపించిన రవి.. ఇంతకీ సీఎం.. దళిత బంధువా.. దళిత వ్యతిరేకా అని సందేహం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ నూటికి నూరుపాళ్లూ దళిత వ్యతిరేకే అని మల్లు రవి వ్యాఖ్యానించారు. గాంధీ భవన్ లో ఇవాళ ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “దళితులకి 10 లక్షలు ఇవ్వడంలో మేము వ్యతిరేయకం కాదు.. దళితులకి 32 వేల ఉద్యోగాలు రాకుండా చేశారు కేసీఆర్.. ప్రతి దళిత కుటుంబానికి ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఏమయింది..” అని ప్రశ్నలు ఎక్కుపెట్టారు.

దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వని కేసీఆర్ దళిత బంధువా .. దళిత వ్యతిరేకా.. అనిన మల్లు రవి, హుజురాబాద్ లో ఓట్ల కోసమే పైలెట్ ప్రాజెక్టుగా దళిత సాధికారతపై స్కీమును పెట్టారన్నారు. అన్ని జిల్లాల్లో దళిత బంధు స్కీం ను అమలు చేయాలని ఈ సందర్భంగా మల్లు రవి డిమాండ్ చేశారు.

Read also: AP Special Status : ప్రత్యేక హోదాపై రాజ్యసభ స్తంభన.. ప్లకార్డ్‌లతో పోడియం వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన