Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Special Status : ప్రత్యేక హోదాపై రాజ్యసభ స్తంభన.. ప్లకార్డ్‌లతో పోడియం వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై మంగళవారం రాజ్యసభలో కార్యకలాపాలు కొంచెంసేపు స్తంభించిపోయాయి. ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే..

AP Special Status : ప్రత్యేక హోదాపై రాజ్యసభ స్తంభన..  ప్లకార్డ్‌లతో పోడియం వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన
Rajya Sabha
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 20, 2021 | 9:40 PM

Rajya Sabha : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై ఇవాళ (మంగళవారం) రాజ్యసభలో కార్యకలాపాలు కొంచెంసేపు స్తంభించిపోయాయి. ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత  విజయసాయి రెడ్డితోపాటు ప్రతిపక్ష సభ్యులు తాము రూల్‌ 267 కింద తాము ఇచ్చిన నోటీసును అనుమతించాలని కోరారు. దీనిపై చైర్మన్‌ స్పందిస్తూ రూల్‌ 267 కింద ఈరోజు 15 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారని అందులో జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఇప్పటికిప్పుడు తాను చర్చకు అనుమంతించలేనని అన్నారు.

ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది కూడా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశమే అంటూ దీనిపై చర్చకు మీరు ఎప్పుడు అనుమతిస్తారని ప్రశ్నించారు. చైర్మన్‌ దీనికి సమాధానం చెబుతూ దీనిపై వాదన వద్దని, ఈ అంశం రాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని జవాబిచ్చారు. దీంతో విజయసాయి రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద నిరసనకు దిగారు. ఇంతలో సభను సభలో గందరగోళం ఏర్పడటంతో చైర్మన్‌ సభను గంటపాటు వాయిదా వేశారు.

అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి సభ సమావేశమైన తర్వాత కూడా వైఎస్సార్సీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ దశలో బీజేపీ రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ పియూష్‌ గోయల్‌ జోక్యం చేసుకుంటా విజయసాయి రెడ్డిని ఉద్దేశించి “మీరు చాలా సీనియర్‌ పార్లమెంటేరియన్‌, పార్లమెంట్ సభా మర్యాదులు బాగా అవగతం చేసుకున్నవారు. కోవిడ్ ఎంతటి విలయం సృష్టిస్తున్నదో మీకు తెలుసు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే కోవిడ్‌ మహమ్మారి యావత్ మానవాళికే సవాలుగా నిలిచింది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం లేదా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు యావత్తు సమాజం కోవిడ్ బారినపడి అల్లాడుతోంది.. అలాంటి అతి ముఖ్యమైన అంశంపై సభ చర్చకు సమాయాత్తమైంది. ఆందోళనను విరమించి చర్చలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది” అని అన్నారు.

అయినప్పటికీ పోడియం వద్ద ఉన్న వైఎస్సార్సీ ఎంపీలు మాకు న్యాయం కావాలి అని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను ముందుకు సాగనీయకపోవడంతో సభ తిరిగి కొద్ది సేపు వాయిదా పడింది.

Read also : YS Sharmila: ఖమ్మం జిల్లా పెనుబల్లిలో నిరుద్యోగ నిరసన దీక్షలో వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్