Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో కల్లోలం.. ఉచిత కరెంటుపై రేవంత్ రెడ్డి అసలేమన్నారు..? వీడియో..
Revanth Reddy on free current: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కల్లోలం రేపాయి.. రేవంత్ వ్యాఖ్యలపై సొంత పార్టీలో రుసరుసలు మొదలైతే.. ప్రత్యర్ధులు మాత్రం అస్త్రంగా మార్చుకుని.. విమర్శలు గుప్పిస్తున్నారు.
Revanth Reddy on free current: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కల్లోలం రేపాయి.. రేవంత్ వ్యాఖ్యలపై సొంత పార్టీలో రుసరుసలు మొదలైతే.. ప్రత్యర్ధులు మాత్రం అస్త్రంగా మార్చుకుని.. విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులకు మేలు చేసే విధానాలను ఎలా వ్యతిరేకిస్తారంటూ బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలోపడి కవరింగ్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల మధ్య హాట్ అండ్ హీటెడ్ డైలాగ్ వార్ మరింత ముదురుతోంది.. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ విషయంలో ఏం మాట్లాడారు.. ఆ సందర్భంలో ఏమన్నారు.. అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.. ప్రభుత్వ ఏర్పాటు చేస్తే 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తారా..? రైతుబందు కంటిన్యూ చేస్తారా..? అని అడిగిన ప్రశ్నకు రేవంత్ సమాధానమిస్తూ వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి వివరించారు.
ఉచిత కరెంటు విషయంలో కేసీఆర్ మభ్యపెడుతున్నారని.. తెలంగాణ 95 శాతం మంది రైతులు 3 ఎకరాలు లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులంటూ పేర్కొన్నారు. ఒక ఎకరానికి నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు.. అదే మూడు ఎకరాలకు నీళ్లు పట్టాలంటే.. ఫుల్లుగా మూడు గంటలు చాలు.. మొత్తంగా 8గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24గంటల కరెంట్ అనే స్లోగన్ తీసుకువచ్చారంటూ తెలిపారు. 24గంటల కరెంటు ఇస్తే ఆటోమెటిక్ స్టార్టర్స్ ఉన్నాయని వివరించారు.
24 గంటల ఉచిత విద్యుత్ వల్ల మోటార్లు నిరంతరాయంగా నడుస్తున్నాయని.. చివరకు కాలిపోతున్నాయని.. ఆటోమెటిక్ స్టార్టర్లు మార్చాలంటే ఐదు ఆరువేల వరకు అవుతుందని తెలిపారు. ఇలా ఉచితం అనుచితం కావొద్దంటూ ఉచిత కరెంటుపై రైతు డిక్లరేషన్ లో స్పష్టంగా చేప్పామంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఇంకా రేవంత్ రెడ్డి ఏమన్నారో పూర్తిగా ఈ కింద ఇచ్చిన వీడియోలో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..