చెట్టుపై గంటకు పైగా తలకిందులుగా తల్లడిల్లిన గీత కార్మికుడు.. ఏం జరిగిందంటే..?
ఆ కార్మికులు నిత్యం ప్రమాదాలతోటే సహజీవనం చేస్తుంటారు. కానీ అత్యవసర సమయాల్లో మాత్రం మనిషికి మనిషే తోడు అంటూ ఆ కార్మికులంతా ఐక్యంగా ఉంటారు. ఆపదలో సమయాల్లో దేవుడు మాదిరిగా వ్యవహరిస్తారు. ప్రమాదపుటంచుల్లో కొట్టుమిట్టాడుతున్న తోటి కార్మికుడిని రక్షించి సహాయపడటమే జీవిత పరమార్థమని నిరూపించారు ఆ కార్మికులు. అయితే ఆ కార్మికులు చేసిన సహాయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగామ గ్రామంలో ఎక్కువ శాతం కల్లు గీత కార్మికులే ఉన్నారు. నిత్యం తాటి చెట్లపై కల్లును గీసి, జీవనోపాధి పొందుతున్నారు గీత కార్మికులు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొండూర్ చంద్రయ్య రోజు మాదిరిగానే కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. కిందికి దిగుతుండగా.. ప్రమాదవశాత్తు మోకు జారి తలకిందులయ్యారు. గంటకు పైగా తాటి చెట్టుపై చంద్రయ్య నరకయాతన అనుభవించారు.
చెట్టుపై నుంచి గీత కార్మికుడి అర్తనాదాలు వినిపించాయి. ఈ విషయాన్ని తాటి చెట్లు ఎక్కుతున్న తోటి గీత కార్మికులు గమనించారు. తాటి చెట్టుపై తలకిందులుగా వేలాడుతున్న చంద్రయ్యను రక్షించేందుకు కొందరు గీత కార్మికులు యాదయ్య, ఇస్తారి, కృష్ణయ్యలు ఒక్కొక్కరిగా చెట్టెక్కి అరగంటపాటు శ్రమించారు. ఎంతో సాహసంతో తమ ప్రాణాలకు తెగించి చంద్రయ్యను కాపాడారు. ప్రమాదంలో చంద్రయ్యకు ఎలాంటి గాయాలు కాకుండా తోటి కార్మికులు తాటి చెట్టు నుండి కిందికి దించారు. ప్రాణాలు దక్కించుకున్న చంద్రయ్య సురక్షితంగా కిందుకు దిగి వచ్చాడు. ప్రమాదం అని తెలిసినా.. ఆపదలో ఉన్న తోటి కార్మికుడి ప్రాణాలను కాపాడిన గీత కార్మికులను స్థానికులు అభినందించారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..