AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నేడు తెలంగాణ రాష్ట్ర బంద్.. ఎందుకో తెలుసా? 

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఈరోజు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేక విడుదల చేశారు

Telangana: నేడు తెలంగాణ రాష్ట్ర బంద్.. ఎందుకో తెలుసా? 
Maoist Bandh
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Dec 09, 2024 | 7:15 AM

Share

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వమా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సంబరాలు నిర్వహిస్తుంది. మరోవైపు మావోయిస్టు పార్టీ బంద్ పిలుపు నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.. తెలంగాణ – మహారాష్ట్ర – ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు అడవులను జల్లడపడుతూ మావోయిస్టులను ఏరి పారాయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు బంద్ పిలుపు.. మరోవైపు పోలీసుల హై అలర్ట్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఈరోజు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేక విడుదల చేశారు.. ఆ లేఖలో మావోయిస్టులు కీలక ఆరోపణలు చేశారు.. మావోయిస్టు పార్టీ దళం 30వ తేదీన చల్పాక అడవుల్లో బస చేసింది నిజమే అని ప్రకటించారు. మావోయిస్టు దళంపై విషప్రయోగం చేసి హతమార్చారని ప్రకటించారు. ఆ ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం – ఆ పార్టీ నేతలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా 9వ తేదీన రాష్ట్ర బంద్ పాటించాలని పిలుపునిచ్చారు.

మావోయిస్టు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పీఎల్‌జీఏ వారోత్సవాలకు ముందే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.. ఈ ఎన్కౌంటర్లో ఏకంగా ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. వీరిలో ఇద్దరు కీలక నేతలు ఉండగా మరో ఐదుగురు ద్వితీయ శ్రేణి మావోయిస్టులు ఉన్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై భిన్న ప్రచారం జరిగింది. ఆహారంలో విషప్రయోగం చేసి పట్టుకొని, చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని మృతుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సంఘం కోర్టును ఆశ్రయించారు.

ఎన్‌కౌంటర్‌పై రకరకాల ప్రచారం జరుగుతున్న సమయంలోనే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట కీలక ప్రకటన వెలువడింది. నవంబర్ 30వ తేదీన దళం చల్పాక అడవులకు చేరుకున్నది నిజమే అని ప్రకటించిన మావోయిస్టు పార్టీ.. తమ దళానికి బోజనాలు సమకూర్చాలని చల్పాక గ్రామానికి చెందిన ఒక ఆదివాసిని కోరారని తెలిపారు. అతను పోలీసులకు అప్రోవర్‌గా మారి గ్రేహౌండ్స్ బలగాలు ఇచ్చిన విషాహారం తమ దళానికి అందించారని లేఖలో ప్రకటించారు. విషయం కలిపిన ఆహారం తిని దళం మొత్తం స్పృహ తప్పి పడిపోయారని ప్రకటించారు. గ్రేహౌండ్స్ బలగాలు వారిని పట్టుకొని చిత్రహింసలు పెట్టీ తెల్లవారుజామున 4 గంటలకు కాల్చి చంపారని ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించిన మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నేతలే బాధ్యత వహించాలని హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి