AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాటిపైనే కొనసాగనున్న చర్చ..

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభకానున్నాయి.  ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, సభలో చర్చ జరుగుతుందని తెలుస్తుంది.

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాటిపైనే కొనసాగనున్న చర్చ..
Telangana Assembly
Velpula Bharath Rao
|

Updated on: Dec 09, 2024 | 7:54 AM

Share

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఏడు చట్ట సవరణ బిల్లులను  ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశాల్లో రెండు కొత్త బిల్లులను సర్కార్ ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌(ఆర్‌వోఆర్‌) బిల్లును ప్రవేశపెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురి సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించబోయో బిల్లును కూడా  సర్కార్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు( ఆర్డినెన్స్) 2024 తో పాటు పురపాలక సంఘాల (సవరణ) ఆర్డినెన్స్ 2024,GHMC సవరణ ఆర్డినెన్స్ 2024 లను సభలో టేబుల్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంచనున్నారు 2022- 2023 సంవత్సరానికి గాను తెలంగాణ విద్యుత్, ఆర్థిక సంస్థ వార్షిక నివేదిక 2013ను సభలో టేబుల్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉంచనున్నారు. అనంతరం సభను వాయిదా వేస్తారు. మధ్యాహ్నం బీఏసీ సమావేశం,సెషన్‌ను ఎన్ని రోజులు నిర్వహించాలనే బీఏసీలో క్లారిటి ఇస్తారు. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, సభలో చర్చ జరుగుతుంది. పలు ప్రజా ప్రయోజక బిల్లులు సభలో ఆమోదించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.  అలాగే సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చించ జరగుతుందని చేప్పడంతో ఎలాంటి సందేహం లేదు.

డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను మంత్రులు , అధికారులు ఆదివారం పర్యవేక్షించారు. ఈరోజు సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేయనున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది పాల్గొంటారని, ఇందుకు తగ్గు ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు. ఆవిష్కరణ సందర్భంగా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నందున తగ్గు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మీడియా గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాల వేదికకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆమె పర్వవేక్షించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు, ప్రజాప్రతినిధులకు, వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహం నమునా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ తల్లి విగ్రహంలో ఆకుపచ్చని చీర ఎడమ చేతిలో మొక్క జొన్న.. వరి కంకీ..మొక్క జొన్న కంకి .. సజ్జ కంకీ.. బంగారు రంగు అంచు పోరాట స్ఫూర్తిని తెలిపేలా.. పిడికిళ్లు అందులో కనిపిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి