Adilabad: అక్కడ ఎటు చూసిన పులుల ఆనవాళ్లే.. ఆనందంలో అధికారులు.. ఆందోళనలో రైతులు, పశువుల కాపరులు..
Adilabad: వామ్మో పులులు అని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. పులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ విచిత్ర పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ బఫర్ జోన్ పరిధిలో ఉంది.
Adilabad: వామ్మో పులులు అని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. పులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ విచిత్ర పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ బఫర్ జోన్ పరిధిలో ఉంది. ఈ బఫర్ జోన్ పరిధిలో ఎటు చూసిన పులుల ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. దాంతో స్థానిక రైతులు, పశువుల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. అటవీశాఖ అధికారులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకెళితే.. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి), కుంటాల మండలాల్లో పులి పాదముద్రలు కనిపించాయి. మరోవైపు మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న గుడిపేటలోని పంటపొలాల్లోకి వచ్చింది పులి. ఇక ఆసిపాబాద్ జిల్లా పెంచికల్ పేట, దహేగాం, సిర్పూర్ ( టి ) మండలాల్లో వరుసగా పశువుల పై దాడులకు పాల్పడుతున్నాయి పులు. అయితే, పులులు.. కోర్ ఏరియాను వీడి బఫర్ జోన్‌లో స్వేచ్చగా సంచరిస్తున్నాయి. దట్టమైన అరణ్యం నుండి జనావాసాల్లోకి బెబ్బులులు. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్‌లో పులుల సంఖ్య 22 కి చేరింది. వీటిలో దాదాపు 10 పులులు మహారాష్ట్ర తడోబా, తిప్పేశ్వర్ నుండి వలస వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్( జి ), కుంటాల మండలాల పరిధిలో రెండు పులులు సంచిరస్తున్నట్లు గుర్తించారు. వీటిలో ఒక పులి తిప్పేశ్వర్ నుండి వలస వచ్చిన గబ్బర్‌గా అనుమానిస్తున్నారు అధికారులు.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో పులుల సంచారం పెరిగినందుకు అటవీ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పులులు అటవీ ప్రాంతాన్ని వీడి విచ్చలవిడిగా జనావాసాల్లో తిరుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా పులులు పశువులపై దాడి చేస్తుండటంతో భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి వచ్చి దాడులు చేస్తాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు.
Also read:
Business Plan: యూట్యూబ్ చూసి లక్షలు సంపాదిస్తున్నాడు.. విజయ పథంలో దూసుకుపోతున్న జార్ఖండ్ యువకుడు
Tea Side Effects: టీతో జర జాగ్రత్త..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు! (Video)