మూడేళ్లకే.. నూరేళ్లు నిండాయి

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల బాలుడికి అనుకోని ప్రమాదంతో నూరేళ్లు నిండాయి. అప్పటి వరకు స్నేహితులతో సంతోషంగా ఆడుకుంటున్న ఆ బాలుడిని ప్రహారీ గోడ రూపంలో మృత్యువు కబలించింది.జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం రాజపురం గ్రామంలో అంగన్‌వాడీ పాఠశాల గోడ కూలి మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. వీరుపాక్షమ్మ, గోపాల్‌ల ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు వరుణ్‌. మూడేళ్ల వరుణ్‌..స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ స్కూల్‌కి వెళ్తున్నాడు. రోజూలాగే..ఆ రోజు కూడా […]

  • Anil kumar poka
  • Publish Date - 8:47 pm, Sat, 21 December 19
మూడేళ్లకే.. నూరేళ్లు నిండాయి

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల బాలుడికి అనుకోని ప్రమాదంతో నూరేళ్లు నిండాయి. అప్పటి వరకు స్నేహితులతో సంతోషంగా ఆడుకుంటున్న ఆ బాలుడిని ప్రహారీ గోడ రూపంలో మృత్యువు కబలించింది.జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం రాజపురం గ్రామంలో అంగన్‌వాడీ పాఠశాల గోడ కూలి మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. వీరుపాక్షమ్మ, గోపాల్‌ల ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు వరుణ్‌. మూడేళ్ల వరుణ్‌..స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ స్కూల్‌కి వెళ్తున్నాడు. రోజూలాగే..ఆ రోజు కూడా వెళ్లాడు.

స్కూల్‌ వద్ద దింపిన తల్లికి సంతోషంగా బాయ్‌ చెప్పాడు. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. అంగన్‌వాడీ భవనం దగ్గర వరండాలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా కొత్తగా నిర్మించిన గోడ కూలిపోయింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిని ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వరుణ్ మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పసిబాలుడు చనిపోవటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.