AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అశ్వత్థామరెడ్డి‌ లీవ్ లెటర్.. రిజెక్ట్ చేసిన ఆర్టీసీ యాజమాన్యం!

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘకాలం చేపట్టిన సమ్మెకు సారధ్యం వహించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సమ్మె కారణంగా వార్తల్లో నిలిచిన ఆయన.. ఇప్పుడు చేయాల్సిన ఉద్యోగాన్ని కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మెను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేసేందుకు కంకణం కట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నేతల ప్రమేయం లేకుండా ఆయన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి కార్మికులతో మాట్లాడటం […]

అశ్వత్థామరెడ్డి‌ లీవ్ లెటర్.. రిజెక్ట్ చేసిన ఆర్టీసీ యాజమాన్యం!
Ravi Kiran
|

Updated on: Dec 22, 2019 | 11:26 AM

Share

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘకాలం చేపట్టిన సమ్మెకు సారధ్యం వహించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సమ్మె కారణంగా వార్తల్లో నిలిచిన ఆయన.. ఇప్పుడు చేయాల్సిన ఉద్యోగాన్ని కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.

సమ్మెను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేసేందుకు కంకణం కట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నేతల ప్రమేయం లేకుండా ఆయన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి కార్మికులతో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా మున్ముందు ఆర్టీసీలో యూనియన్ల మాట రాకుండా ఉండేందుకు సీఎం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో అశ్వద్ధామరెడ్డి తన చేయాల్సిన ఉద్యోగాన్ని కూడా చేయలేని పరిస్థితి.. అందుకే ఆర్నెల్లు సెలవు కావాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులను కోరారట.

అయితే అధికారులు మాత్రం ఆయనకు షాక్ ఇస్తూ లీవ్‌ను సున్నితంగా తిరస్కరించారని వినికిడి. సంస్థ సంక్షోభంలో ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో సెలవు ఇవ్వడం కుదరదని అశ్వద్ధామ లీవ్ లెటర్‌ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆ విషయాన్ని అశ్వత్థామరెడ్డికి డైరెక్ట్‌గా చెప్పకుండా నోటీసు బోర్డుపై అతికించారట.