AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతా ఫ్రాడ్..ఫోర్బ్స్‌పై మండిపడిన కంగనా సోదరి..

బాలీవుడ్‌లో కంగనా రనౌత్ పేరు చెబితే యాక్టింగ్ కంటే ముందు వివాదం గుర్తుకువస్తుంది. ఇక ఆమె సోదరి రంగోలి రనౌత్ కూడా వివాదస్పద వ్యాఖ్యలతో, ట్వీట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వీరు ఒకరిని టార్గెట్ చేశారంటే చాలు..కొన్నాళ్లపాటు ఆ వ్యక్తిపై విమర్శల దాడి కొనసాగిస్తారు. ఇటీవలే తాప్సీకి, రనౌత్ సిస్టర్స్‌కి  మధ్య పెద్ద వార్ నడిచింది. కంగనా స్టైల్‌ను తాప్సీ ఫాలో అవుతోందంటూ..రంగోలి తెగ హడావిడి చేసింది. ఈ ఇష్యూ కొద్దిగా సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో […]

అంతా ఫ్రాడ్..ఫోర్బ్స్‌పై మండిపడిన కంగనా సోదరి..
Ram Naramaneni
|

Updated on: Dec 22, 2019 | 5:31 AM

Share

బాలీవుడ్‌లో కంగనా రనౌత్ పేరు చెబితే యాక్టింగ్ కంటే ముందు వివాదం గుర్తుకువస్తుంది. ఇక ఆమె సోదరి రంగోలి రనౌత్ కూడా వివాదస్పద వ్యాఖ్యలతో, ట్వీట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వీరు ఒకరిని టార్గెట్ చేశారంటే చాలు..కొన్నాళ్లపాటు ఆ వ్యక్తిపై విమర్శల దాడి కొనసాగిస్తారు. ఇటీవలే తాప్సీకి, రనౌత్ సిస్టర్స్‌కి  మధ్య పెద్ద వార్ నడిచింది. కంగనా స్టైల్‌ను తాప్సీ ఫాలో అవుతోందంటూ..రంగోలి తెగ హడావిడి చేసింది. ఈ ఇష్యూ కొద్దిగా సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో తాజాగా రంగోలి ఫోర్బ్స్ జాబితాపై తన అక్కసును వెళ్లగక్కింది. సదరు లిస్ట్ అంతా ఫేక్ అంటూ పైరయ్యింది. సెలబ్రిటీల ఆదాయం అసలు బయటకు ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించింది. కంగనాకు వచ్చే ఇన్‌కమ్ కన్నా ట్యాక్సులే ఎక్కువ పే చేస్తోందని..ఫోర్బ్స్  ప్రకటించిన ప్రముఖుల ఆదాయ వివరాలు సరైనవేనని ప్రూవ్ చేయగలరా? అని సవాల్ విసిరింది.

ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక ఆదాయం అర్జిస్తున్న సెలబ్రిటీల లిస్ట్‌లో రూ. 17. 5 కోట్ల సంపాదనతో కంగనా 70 వ స్థానంలో నిలిచింది. దీంతో అబద్దపు జాబితాతో లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటూ మండిపడింది రంగోలి రనౌత్. ఈ సంవత్సరం కంగానాకు వచ్చిన ఆదాయం ఆమెకే తెలియదని..తనకు, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ వాళ్లకు మాత్రమే తెలుసని పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వివరాలు లీక్ చేశారా..లేక అబద్దపు లిస్ట్‌తో జనాలను మభ్యపెడుతున్నారా అంటూ  చందేల్‌ ఫోర్బ్స్‌ ఇండియా పత్రికపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక సదరు పత్రిక ప్రూప్స్ చూపిస్తే..క్షమాపణ చెప్పేందుకు సిద్దమని ప్రకటించింది రంగోలి.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత