AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tejaswi Madivada: ఆ సినిమాతో బ్రేక్.. దెబ్బకు 40 చిత్రాల్లో ఛాన్స్.. కానీ ఆ మూవీ ఆ ప్రచారంతో మొత్తం పోయింది.. తేజస్వి..

తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ తేజస్వి మదివాడ. చిన్న చిన్న సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించిన ఆమె.. తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఆమెకు బ్రేక్ వచ్చింది. ఈ మూవీతో రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత తనకు దాదాపు 40 సినిమాల్లో అవకాశం వచ్చిందని తెలిపారు.

Tejaswi Madivada: ఆ సినిమాతో బ్రేక్.. దెబ్బకు 40 చిత్రాల్లో ఛాన్స్.. కానీ ఆ మూవీ ఆ ప్రచారంతో మొత్తం పోయింది.. తేజస్వి..
Tejaswi Madivada
Rajitha Chanti
|

Updated on: Aug 15, 2026 | 12:42 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటన, గ్లామర్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి తేజస్వి మడివాడ. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత ‘హార్ట్ ఎటాక్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న తేజస్వి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో వచ్చిన గుర్తింపు వల్ల ఏకంగా 40 కి పైగా సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని ఆమె తెలిపారు. వరుస ఆఫర్లతో కెరీర్ ఎంతో ఆశాజనకంగా సాగుతుందనుకున్న సమయంలో, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ఐస్ క్రీమ్’ సినిమా ఆమె కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పింది. ఈ సినిమాలో ఆమె నగ్నంగా నటించిందంటూ జరిగిన ప్రచారం ఆమె ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఆ వార్తల్లో నిజం లేదని తాను వివరణ ఇచ్చినప్పటికీ, ఇండస్ట్రీలో ఆమెపై ‘బోల్డ్’ అనే ముద్ర పడిపోయిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..

ఈ ఒకే ఒక్క ముద్ర కారణంగా తనకు రావాల్సిన అనేక మంచి కుటుంబ కథా చిత్రాలు, హోమ్‌లీ పాత్రల అవకాశాలు చేజారిపోయాయని తేజస్వి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతల నుండి మంచి కథల కోసం వచ్చే కాల్స్ తగ్గిపోయి, తనకు నచ్చని తరహా ఆఫర్లు రావడం మొదలైంది. ఆ తర్వాత ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొనడం కూడా నటిగా ఆమె ఇమేజ్‌పై మరో రకమైన ప్రభావం చూపిందని ఆమె పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

నటనలోని వైవిధ్యాన్ని పక్కన పెట్టి, ఒక పాత్ర ఆధారంగా నటులపై ముద్ర వేయడం వల్ల కెరీర్ ఎంతటి ఒడిదొడుకులకు లోనవుతుందో తన అనుభవం ద్వారా నేర్చుకున్నానని తేజస్వి చెప్పకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక నటిగా అవకాశాలు వస్తున్న సమయంలో బిగ్ బాస్ షోలోకి వెళ్లడం వల్ల ప్రేక్షకులలో తనపట్ల ఒక రకమైన ఇమేజ్ ఏర్పడిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Follow Us