AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లష్కర్-ఎ-తైబా ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం.. షోపియాన్‌లో ఆసక్తికర దృశ్యం!

దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్‌లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. షోపియాన్‌లో లష్కర్-ఎ-తైబా కమాండర్‌ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటి పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ఊపుతూ వారు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. భారత దేశం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

లష్కర్-ఎ-తైబా ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం.. షోపియాన్‌లో ఆసక్తికర దృశ్యం!
Terrorist Parents Hoist National Flag
Balaraju Goud
|

Updated on: Aug 15, 2026 | 1:56 PM

Share

దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్‌లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. షోపియాన్‌లో లష్కర్-ఎ-తైబా కమాండర్‌ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటి పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ఊపుతూ వారు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. భారత దేశం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

భద్రతా సంస్థల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అబిద్ రంజాన్ షేక్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. కశ్మీర్‌లో పలు ఉగ్రవాద ఘటనలతో అతనికి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. స్థానికేతర కార్మికులపై జరిగిన లక్షిత దాడులకు కూడా అతను ఆదేశాలు ఇచ్చినట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అతని తల్లిదండ్రులు ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ దృశ్యం 2021లో జరిగిన మరో ఘటనను గుర్తు చేసింది. అప్పట్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ తండ్రి ముజఫర్ వానీ ఓ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు.

ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ప్రసంగంలో 2019లో రద్దైన రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా లోక్ భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, సమ్మిళిత సమాజ నిర్మాణానికి ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us