AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్.. క్యాప్చా ఇకపై ఉండదు.. వేగవంతంగా టికెట్ బుకింగ్..

రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా మరింత వేగంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇకపై క్యాప్చా ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. ఈ మేరకు కొత్త రిజర్వేషన్ వ్యవస్థను రైల్వేశాఖ ప్రవేశపెడుతుంది.

IRCTC: త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్.. క్యాప్చా ఇకపై ఉండదు.. వేగవంతంగా టికెట్ బుకింగ్..
Irctc
Venkatrao Lella
|

Updated on: Aug 15, 2026 | 2:10 PM

Share

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దాదాపు పనులు పూర్తవ్వగా.. త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ కొత్త వెబ్‌సైట్లో టికెట్లను వేగవంతంగా బుక్ చేసుకునేందుకు వీలుగా అనేక మార్పులు చేశారు. ఇకపై వేగవంతంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్‌ను సులువు చేసేందుకు క్యాప్చా ధృవీకరణను తీసివేశారు. టికెట్లు బుక్ చేసేటప్పుడు క్యాప్చా ఎంటర్ చేయాల్సి రావడం వల్ల ఆలస్యమవుతుంది. ఇప్పుడు దీనిని తీసివేయడం వల్ల వేగంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

దశలవారీగా వెబ్‌సైట్ ప్రారంభం

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ బీటా వెర్షన్ ఇప్పటికే విడుదల చేశారు. క్యాప్చా లేని పూర్తిస్థాయి వెబ్ సైట్ వెర్షన్ ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రారంభించనున్నారు. ఇక ట్రైన్లలో ఆహార పంపిణీకి సంబంధించి మరిన్ని మార్పులు చేయనున్నారు. ఇప్పటికే రెండు క్యాటరింగ్ ప్లాంట్లను పునరుద్దరించగా.. మరో నాలుగు కొత్త ప్లాంట్లను ప్రారంభించనున్నారు. ఆదాయంలో క్యాటరింగ్ బిజినెస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది 10 నుంచి 12 శాతం వృద్దిని ఆశిస్తోంది. దీంతో క్యాటరింగ్ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ సేవలను మరింత మెరుగుపర్చేందుకు సిద్దమవుతోంది. 1986లో సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. నాలుగు దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దాని స్థానంలో కొత్త రిజర్వేషన్ వ్యవస్థను తీసుకురావాలని రైల్వేశాఖ భావించింది. ఈ మేరకు కొత్త వెబ్‌సైట్‌ను అభివృద్ది చేస్తోంది. ఆగస్ట్ నుంచి దశలవారీగా ఈ వెబ్ సైట్ ప్రారంభించనున్నారు.

నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్

ప్రస్తుత వ్యవస్థ ద్వారా నిమిషానికి 32 వేల టికెట్లను మాత్రమే బుక్ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంది. అయితే కొత్త వ్యవస్థలో నిమిషానికి 1.5 లక్షలకుపైగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం నిమిషానికి 4 లక్షలుగా ఉన్న విచారణల సామర్థ్యం ఇప్పుడు 40 లక్షలకు పెరగనుంది. టికెట్లు, విచారణ కోసం ఇతర భాషలను కూడా జోడించనున్నారు. వినియోగదారులకు అనుకూలంగా కొత్త ఇంటర్ ఫేస్ ఉంటుంది. అలాగే కొత్త వెబ్ సైట్లో ఏఐ సాంకేతిక ప్రవేశపెట్టనున్నాయి. దీని ద్వారా వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్పార్మ్ అవుతుందా.. లేదా అనేది అత్యంత ఖచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. దీని ద్వారా టికెట్ కన్పార్మ్ అవుతుందా.. లేదా అనేది ముందే తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల ప్రయాణికులు ముందుగానే అంచనా వేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌