పల్లె పాటకు పట్టం..గోరటికి అరుదైన గౌరవం

ప్రజాకవి, వాగ్గేయకారుడు అతడో నడుస్తున్న జానపద గ్రంథాలయం గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ జానపదాన్ని తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గోరటి వెంకన్నకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం “కబీర్‌ సమ్మాన్‌’ పురస్కారం ప్రకటించింది. వివిధ భాషల్లో ప్రతిభ కనబరిచిన సాహితీవేత్తలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాన్ని ఇచ్చి గౌరవిస్తోంది. ఈ ఏడాదికి గానూ గోరటి వెంకన్న ఈ అవార్డుకు ఎంపికవడం గమనార్హం. పల్లె పాటల ద్వారా గోరటి వెంకన్న తెలుగు రాష్ట్రాల్లో విశేష […]

పల్లె పాటకు పట్టం..గోరటికి అరుదైన గౌరవం
Follow us

|

Updated on: Dec 21, 2019 | 6:50 PM

ప్రజాకవి, వాగ్గేయకారుడు అతడో నడుస్తున్న జానపద గ్రంథాలయం గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ జానపదాన్ని తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గోరటి వెంకన్నకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం “కబీర్‌ సమ్మాన్‌’ పురస్కారం ప్రకటించింది. వివిధ భాషల్లో ప్రతిభ కనబరిచిన సాహితీవేత్తలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాన్ని ఇచ్చి గౌరవిస్తోంది. ఈ ఏడాదికి గానూ గోరటి వెంకన్న ఈ అవార్డుకు ఎంపికవడం గమనార్హం.

పల్లె పాటల ద్వారా గోరటి వెంకన్న తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రజాదరణ పొందారు. ఆయన రాసి, ఆలపించిన “పల్లె కన్నీరు పెడుతుందో..కనిపించని కుట్రల…’ అనే పాట దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. “గల్లీ సిన్నదీ గరీబోల్ల కధ పెద్దది’.. అనే పాట యావత్‌ తెలంగాణ ప్రజానీకాన్ని ఊర్రూతలూగించింది. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయి. నాగర్‌ కర్నూలు జిల్లా గౌరారంలో జన్మించిన గోరటి వెంకన్న.

తెలంగాణ పల్లె ప్రజల జీవన విధానాన్ని వివరించే పాటలను రాసి, స్వయంగా పాడారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలతో పాటు.. అటు శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమ ప్రాంతాల్లో జానపదులు పాడుకునే పాటలన్నింటినీ ఆయా ప్రజల వాడుక భాషలో వెంకన్న పాడి వినిపిస్తారు. శ్రీరాములయ్య, కుబుసం, వేగుచుక్కలు, మహాయజ్ఞం, బతుకమ్మ, నగరం నిద్రపోతున్న వేళ తదితర సినిమాలకు కూడా గోరటి వెంకన్న పాటలు రాశారు. ఆయన పాటలు పల్లె సంస్కృతి, జీవనస్థితులకు అద్దంపడతాయి. రచయితగా, గాయకుడిగా గోరటి వెంకన్న పలు పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. 2016లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పురస్కారం అందించింది. 2006లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డును అందించింది.

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!