AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఊరంతా టెన్షన్ పెట్టిన ముగ్గురు పిల్లలు.. రాత్రంతా జనానికి జాగారమే.. చివరికీ..!

పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరిన ముగ్గురు చిన్నారులు, సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆటాడుకుంటూ ఉండిపోయారు. చీకటి పడటంతో..!

Telangana: ఊరంతా టెన్షన్ పెట్టిన ముగ్గురు పిల్లలు.. రాత్రంతా జనానికి జాగారమే.. చివరికీ..!
Missing Children Safe
N Narayana Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 14, 2024 | 4:28 PM

Share

అదేందీ ఊరుని పిల్లలు పరేషాన్ చేసుడు ఏంది అనుకుంటున్నారా..? నిజమే..! ఊరు ఊరంతా ఉలిక్కిపాటుకు గురైంది. ఈ పిల్లలు చేసిన పనికి, ఊరు జనానికి రాత్రి నిద్ర కూడా లేకుండా చేశారు. చివరికి పిల్లల జాడ దొరకడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. అసలు ఏమి జరిగిందంటే..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన ప్రసాద్, కావ్య, నాగశ్రీ ముగ్గురు చిన్నారులు ఆరవ తరగతి చదువుతున్నారు. శుక్రవారం(డిసెంబర్ 13) పాఠశాలకు వెళ్లి సాయంత్రం సమయంలో బడి నుండి ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. ఆటలో నిమగ్నం అయ్యి ఇంటికి వెళ్లాలనే విషయాన్ని మర్చిపోయారు.. అప్పటికే చీకటి పడిపోయింది. ఈ సమయంలో వెళితే పేరెంట్స్ కొడతారని భయపడి.. సమీపంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చెట్ల పొదల్లో నక్కిపోయారు. ఇక అక్కడే నిద్రపోయారు.

పాఠశాలకు వెళ్లిన పిల్లలు రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాల పరిసరాలతో పాటు ఊరంతా వెతికారు. అయినా జాడ కనిపించలేదు. గ్రామంలోని పెద్దలకు సమాచారం అందించారు. ఊరు అంతా ఏకమై అన్ని చోట్ల గాలించారు. ఎంతకీ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి.. చిన్నారుల కోసం రాత్రంతా వెతికిన ఆచూకీ లభించకపోవడంతో భిన్న కోణాల్లో చిన్నారుల జాడ కోసం ప్రయత్నించారు. ముగ్గురు చిన్నారులు ఒక్కసారిగా మిస్ అవ్వడంతో ఊరంతా భయాందోళనకు గురయ్యారు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయాన్నే ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టేందుకు వెళ్లిన రైతుకు, ఆ బస్తాల పక్కన చెట్ల పొదల్లో కనిపించిన ఓ దృశ్యం కనిపించింది. ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నిన్న సాయంత్రం నుండి కనిపించకుండా పోయిన ముగ్గురు పిల్లలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. రైతు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకుని పిల్లలను చూసి ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి అంతా ఊరిని ఉరుకులు పరుగులు పెట్టించిన చిన్నారులు చివరకు సురక్షితంగా బయటపడడంతో ఊరంతా హమ్మయ్యా అంటూ ఊపిరి పిల్చుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…