Telangana Constable Exams: పోలీస్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. వారందరికీ మళ్లీ ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయం..
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఊరట లభించింది. ఒక్క సెంటీమీటర్ హైట్ తో డిస్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు తిరిగి ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో..
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఊరట లభించింది. ఒక్క సెంటీమీటర్ హైట్ తో డిస్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు తిరిగి ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో.. వారందరికీ మళ్లీ పరీక్షలు పెట్టేందుకు రెడీ అయ్యింది. ఒక సెంటీమీటర్ హైట్ తో డిస్ క్వాలిఫై అయిన అభ్యర్థులు.. ఈ నెల 10 వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అర్హత కలిగిన వారికి హైదరాబాద్ లో పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. కాగా.. బహుళ సమాధానాలు ఉన్న 7 ప్రశ్నలకు సంబంధించి మార్కులను కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు గతంలోనే నిర్ణయించింది. ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు.
కాగా.. తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల తేదీలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామాక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ). ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30న, కానిస్టేబుల్ (ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి, ఎస్సై(ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసినట్లు టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ వెల్లడించింది. ఈ పరీక్షల సమయంలో ఇతర పరీక్షలు కూడా ఉన్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) చేసిన విజ్ఞప్తి మేరకే పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా.. నోటిఫికేషన్ ప్రకారం 16,969 కానిస్టేబుల్ పోస్టుల కోసం ప్రస్తుతం తుది రాతపరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు. అంటే ఒక్కో పోస్టుకు 11 మంది వరకు పోటీలో ఉన్నట్లు లెక్క. అలాగే 587 ఎస్‌ఐ పోస్టుల కోసం 59,574 మంది బరిలో మిగిలారు. అంటే ఒక్కో కొలువుకు 101 మంది వరకు పోటీలో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం