AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా తానే గెలుస్తానన్న రాజాసింగ్‌కు బీఆర్ఎస్ నేత కౌంటర్..

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కౌంటరిచ్చారు గోషామహల్‌ బీఆర్ఎస్ నేత ఆశిష్‌కుమార్‌ . రాజాసింగ్‌ పగటికలలు మానేయ్యాలని, అస్సలు ఆయన ఏపార్టీలో ఉన్నారో తెలుసుకోవాలని..

Telangana: వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా తానే గెలుస్తానన్న రాజాసింగ్‌కు బీఆర్ఎస్ నేత కౌంటర్..
Rajasingh
Sanjay Kasula
|

Updated on: Feb 08, 2023 | 7:05 PM

Share

గోషామహల్‌లో మళ్లీ తానే గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్‌ నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థి గెలవరన్నారు. బీఆర్ఎస్ వెయ్యికోట్లు ఖర్చు పెట్టినా సరే.. చివరికి తనదే విజయమన్నారు రాజాసింగ్. తానూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే గెలిచి చూపిస్తానంటూ సవాల్‌ విసిరారు ఎమ్మెల్యే రాజాసింగ్‌.  అయితే, ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కౌంటరిచ్చారు గోషామహల్‌ బీఆర్ఎస్ నేత ఆశిష్‌కుమార్‌ . రాజాసింగ్‌ పగటికలలు మానేయ్యాలని, అస్సలు ఆయన ఏపార్టీలో ఉన్నారో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి వెళ్లి గుర్తుచేస్తే రాజాసింగ్‌కి డిపాజిట్ కూడా దక్కదన్నారు. నిజంగా రాజాసింగ్‌కి ధైర్యముంటే రాజీనామా చేసి వస్తే గోషామహల్‌లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని సవాల్ విసిరారు ఆశిష్‌కుమార్‌యాదవ్‌.

ప్రగతి భవన్ ను కూల్చాలని తగలబెట్టాలంటూ టెర్రరిస్టులా మాట్లాడుతున్న ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీజీపీకి లెటర్ రాసినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం రేవంత్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం