Telangana: వీళ్లు కొడుకులు కారు యమకింకరులు.. కన్నతల్లిని స్మశానంలో వదిలేసి..

మనకు నిత్యజీవితంలో కొన్ని దృశ్యాలు కదలిస్తూ ఉంటాయి. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే కొందరు మాత్రం కనీస కనికరం కూడా చూపడంలేదు. దానికి ఈ ఘటనే సాక్ష్యం అని చెప్పవచ్చు.

Telangana: వీళ్లు కొడుకులు కారు యమకింకరులు.. కన్నతల్లిని స్మశానంలో వదిలేసి..
The Sons Who Left The Mother In The Cemetery In Jagitiyal
Follow us
G Sampath Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 27, 2024 | 4:18 PM

తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కొడుకులు తల్లిని భారంగా భావిస్తున్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే కొందరు మాత్రం కనీస కనికరం కూడా చూపడంలేదు. అనాధలుగా రోడ్లపైన వదిలేస్తున్నారు. తాజగా వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని  8 రోజుల క్రితం కొందరు కసాయి కొడుకులు  స్మశానంలో వదిలేశారు. జగిత్యాల జిల్లా మోతే గ్రామానికి చెందిన రాజవ్వకు నలుగురు కొడుకులు వారిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. వృద్దాప్యంలో తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నలుగురు కొడుకులకు భారంగా మారింది తల్లి రాజవ్వ.. దీంతో రాజవ్వని ఎలాగైనా వదిలించుకోవాలనుకొని కొడుకులు స్మశానంలో వదిలేశారు.

గత ఎనిమిది రోజులుగా మోతె స్మశానవాటికలోనే వృద్దురాలు రాజవ్వ కాలం వెల్లదీస్తోంది. తన నాలుగురు కొడుకులలో ఎవరి దగ్గరనూ ఆశ్రయం పొందలేక, చివరకు స్మశానంలో చివరి మజిలీ జీవితాన్ని వెల్లదీస్తోంది. ఆమె కుమారుడు, పెన్షన్ డబ్బుల కోసం తల్లిని దారుణంగా కొట్టి ఆమెను అచేతన స్థితిలో విడిచిపెటట్టడం విస్మయానికి గురిచేసింది. విరిగిన కాలుతో తన పనులు చేసుకోవడానికి  ఇబ్బందులు ఎదుర్కొంటూ మంచానికి పరిమితమైంది. నలుగురు కొడుకులని కని, పెంచి అచేతనంలో ఉన్న తనను కనీసం మనిషిగా చూడడం లేదని ఆ తల్లి రాజవ్వ రోదిస్తుంది. ఈ పరిస్థితిలో రాజవ్వను వదిలి వెళ్ళిపోయిన కొడుకులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మశాన వాటికి చేరుకున్న సంక్షేమశాఖ అధికారులు అక్కడికి చేరుకొని రాజవ్వ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారం రోజులుగా స్మశాన వాటికలో బక్కచిక్కుకుపోయి ఉండడంతో కాస్త కోలుకున్న తర్వాత రాజవ్వ దగ్గర  ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి వయోవృద్ధుల చట్టం ప్రకారం ఈ ఘటనపై అవసరమైన చర్యలు తీసుకుంటామని సంక్షేమశాఖ అధికారి నరేష్ తెలిపారు. ఈ క్రమంలో దుష్ట కుమారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..