Telangana: అంబులెన్స్ కూత ఎప్పుడు వినని ఊరుని ఎప్పుడైనా చూశారా?

ఆపద వచ్చిన అంబులెన్స్ రాలేని పరిస్థితి..ఆ వాగు దాటాలసిందే.. బడికైనా,గుడికైనా ఇలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్న ఆ వాగు దాటాలసిందే.. ఇక వాగు ప్రవాహం పెరిగినప్పుడు తండా వాసులు పడే బాధలు వర్ణనాతీతం.. ఎన్నో ఏళ్లుగా వారి ఊరికి రోడ్డు కావాలని వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు.

Telangana: అంబులెన్స్ కూత ఎప్పుడు వినని ఊరుని ఎప్పుడైనా చూశారా?
Gairan Thanda
Follow us
P Shivteja

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 22, 2024 | 10:56 AM

మెదక్ జిల్లాలోని వ‌గ్ద‌ల్ గ్రామం నుండి గైరాన్ తండాకు వెళ్లాలంటే వాగు నీటిలో నుండే న‌డుచుకుంటూ వెళ్లాలి. ప్ర‌స్తుతం నీళ్లు సాధార‌ణంగానే ఉన్నా.. భారీ వ‌ర్షాలు కురిస్తే.. మోకాళ్ల వ‌ర‌కూ నీటి ప్ర‌వాహం ఉంటుంది. గైరాన్ తండాకు వెళ్ళాలి అనుకోనే వారు,అర కిలోమీట‌ర్ ఇలా వాగులో న‌డిచి తీరాల్సిందే. దీంతో తండా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతారు. ఈ వాగు దాటాలంటే నిత్యం సాహాసం చేయాల్సిందే. ఏ చిన్న అవ‌స‌రానికైనా గైరాన్ తండావాసులు వ‌గ్ద‌ల్ గ్రామానికి రావాల్సి ఉంటుంది. ఇక్క‌డ ఒక ప్రాథ‌మిక పాఠ‌శాల ఉంది. ఆ త‌రువాత తండా పిల్లలు చ‌దువుకోవాలంటే తండా దాటాల్సిందే..ఆరు వంద‌ల జ‌నాభా ఉన్న ఈ గ్రామంలో 60 మంది వ‌ర‌కూ విద్యార్థులున్నారు. వీరు రోజూ ఈ వాగు దాటాల్సిందే.

వ‌ర్షం వ‌స్తే చాలు పాఠ‌శాల‌కు దూర‌మ‌వుతారు. వ‌ర్షం ఎన్ని రోజులు కురుస్తే అన్ని రోజులూ అదే ప‌రిస్థితి..ఒకవేళ విద్యార్థులు పాఠ‌శాల‌కు వెళ్లాక వ‌ర్షం కురిస్తే.. ఆ రోజు పాఠ‌శాల‌లోనే ఉండిపోవాల్సి వ‌స్తుంది.  70 ఏళ్లుగా ఇదే ప‌రిస్థితి గైరాన్ తండా వాసులది. ఈ వాగు ప్ర‌వాహంలో కొట్టుకొనిపోయి చ‌నిపోయింది ముగ్గురే అయినా…వైద్యం అంద‌క చ‌నిపోయిన వారి సంఖ్య ప‌దుల్లో ఉంటుంది. వ‌ర్షం వ‌చ్చిదంటే చాలు ఈ తండావాసులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తుంటారు. ఈ వాగు పై ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా అధికారులకు, రాజకీయ నాయకులకు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  108 కూత ఇప్పటి వరకు ఆ గ్రామం ఒక్క‌సారి కూడా విని ఉండ‌దు. ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికైనా తమ గ్రామంపై దృష్టి పెట్టి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని వారు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!