Hyderabad: బర్త్‌డే పార్టీ కోసం హోటల్‌కు వెళ్లాడు.. కట్‌చేస్తే, కుక్కతో పరాచకాలు.. చివరకు ఏమైందంటే..

బర్త్ డే పార్టీ మధ్యలో హోటల్ రూమ్ లోనుంచి బయటికి వచ్చిన ఉదయ్ కుమార్.. అక్కడే ఉన్న ఒక కుక్కతో పరాచకాలు ఆడాడు.. ఈ క్రమంలో కిటికీ నుంచి కింద పడిపోయాడు.. మూడవ అంతస్తు కిటికీ నుంచి కింద పడటంతో ఉదయ్ కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

Hyderabad: బర్త్‌డే పార్టీ కోసం హోటల్‌కు వెళ్లాడు.. కట్‌చేస్తే, కుక్కతో పరాచకాలు.. చివరకు ఏమైందంటే..
Hyderabad Crime News
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 22, 2024 | 11:49 AM

బర్త్ డే పార్టీ.. స్నేహితులతో కలిసి ఓ పెద్ద హోటల్‌కు వెళ్లాడు.. అక్కడ అనుకోని సంఘటన ఎదురైంది.. పార్టీ మధ్యలో బయటకు వచ్చి అక్కడున్న కుక్కతో పరాచకాలు ఆడాడు.. పరుగులు పెడుతూ దానిని ఆడించాడు.. చివరకు అక్కడున్న కిటికీ వైపు వెళ్లాడు.. ఈ క్రమంలోనే కిటికీలోంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్ లో చోటుచేసుకుంది..

హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్రైడ్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. వి.వి ప్రైడ్ హోటల్ లో మూడో అంతస్తు నుంచి నుండి కిందపడి ఉదయ్ కుమార్ అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రామచంద్రాపురం అశోక్‌నగర్‌లో ఉంటున్న ఉదయ్‌ కుమార్.. తన స్నేహితులతో కలిసి వీవీ ప్రైడ్ హోటల్‌కు వెళ్లాడు.. ఓ ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా చందానగర్‌ వీవీ ప్రైడ్ లోని మూడో అంతస్తులోని రూమ్ లో పార్టీ జరిగింది..

వీడియో చూడండి..

ఈ క్రమంలో పార్టీ మధ్యలో హోటల్ రూమ్ లోనుంచి బయటికి వచ్చిన ఉదయ్ కుమార్.. అక్కడే ఉన్న ఒక కుక్కతో పరాచకాలు ఆడాడు.. ఈ క్రమంలో కిటికీ నుంచి కింద పడిపోయాడు.. మూడవ అంతస్తు కిటికీ నుంచి కింద పడటంతో ఉదయ్ కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

వీడియో చూడండి..

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. చనిపోయిన ఉదయ్ పాలిటెక్నిక్ స్టూడెంట్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు పోలీసులు. సోమవారం జరిగినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో కూడా డెలివరీ కోసం వెళ్లిన జొమాటో బాయ్.. వెంట కుక్క పడటంతో మూడవ అంతస్తు పైనుంచి కింద పడి మృతి చెందిన విషయం తెలిపారు. తాజాగా ఈ ఘటన జరగడం హైదరాబాద్ లో సంచలనంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!