Hyderabad: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. దేశంలో ఎక్కడా లేని విధంగా..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ ప్రత్యేక వ్యవస్థను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన సేవలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్‌ను ప్రారంభించారు. ఇంతకీ ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ సేవలు అంటే ఏంటి.? దీనివల్ల ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా విద్యుత్ నిలిచిపోతే ఎమర్జెన్సీ సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థే ఇది.
హైదరాబాద్ ఎక్కడ విద్యుత్ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ఈ సేవలను ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి. ట్యాంక్ బండ్ సమీపంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ జెండా ఊపి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇందన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎండీ లు ముషారఫ్ అలీ, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను బట్టి విక్రమార్క ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక విద్యుత్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక విద్యుత్ వాహనాలు
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 57 సబ్ డివిజన్ లకు 57 వాహనాలను కేటాయిస్తూ ఈ రోజు డా. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ప్రారంభించడం జరిగింది
ప్రతి వాహనంలో… pic.twitter.com/qBg0Y0HfxI
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) October 21, 2024
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 57 సబ్ డివిజన్ లకు 57 వాహనాలను కేటాయిస్తూ డా. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ప్రారంభించామని రాసుకొచ్చారు. ఇక ప్రతీ వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ సిబ్బందితో పాటు అవసరమైన మెటీరియల్‌తో 24 గంటలపాటు సిద్ధంగా ఉంటారని అన్నారు. అలాగే ప్రతీ వాహనములో ధర్మో విజన్ కెమెరాలు, పవర్ రంపం మిషన్, నిచ్చెనలు, ఇన్సులేరట్లు, కండక్లర్లు, కేబుల్స్‌తోపాగు అవసరమైన అన్ని భద్రతా పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు. 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్ లు ఉంటే.. ప్రతి డివిజన్ కు ఒక వాహనాన్ని కేటాయించామన్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..