Musi River Beautification: భాగ్యనగరానికి సియోల్ మోడల్..! మూసీ కోసం టీ-సర్కార్ మాస్టర్ ప్లాన్‌.. ఇవాళ హన్‌ నదిపై అధ్యయనం

నిన్నటి దాక సింగపూర్‌ మాట. ఇప్పుడు సియోల్‌ బాట. మూసీ పునరుజ్జీం మిషన్‌ కోసం చంగ్‌ చియాన్‌ రివర్‌ బ్యూటీఫికేషన్‌ ను మోడల్గా తీసుకుంది రేవంత్‌ సర్కార్‌. సొగసు చూడతరమా అన్పించే చంగ్‌ చియాన్‌ సోయగాలపై , తెలంగాణ మంత్రుల బృందం స్టడీ టూర్‌పై సియోల్‌ నుంచి టీవీ9 గ్రౌండ్‌ రిపోర్ట్‌...

Musi River Beautification: భాగ్యనగరానికి సియోల్ మోడల్..! మూసీ కోసం టీ-సర్కార్ మాస్టర్ ప్లాన్‌.. ఇవాళ హన్‌ నదిపై అధ్యయనం
Telangana Ministers Team South Korea Visit
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 22, 2024 | 8:23 AM

మన హైదరాబాద్ మహానగర మూసీకి .. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని చంగ్‌ చియాన్‌ నదికి చాలా దగ్గరి పోలికలున్నాయి. ఒకప్పుడు చంగ్‌ చియాన్‌ నది మూసీ కన్నా దుర్గంధభరితంగా ఉండేది. కానీ ఇప్పుడు భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. అందుకు కారణం ప్రభుత్వ సంకల్పం..ప్రజల సహకారం.. మూసీని కూడా చంగ్‌ చియాన్‌లా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలంగాణ మంత్రుల బృందం సియోల్‌లో పర్యటిస్తోంది. తొలిరోజు చంగ్‌ చియాన్‌ సౌందర్యాన్ని చూసి వాహ్వా అంటూ ముగ్దులయ్యారు. అధ్యయనంలో ఇది మన దగ్గర కూడా సాధ్యమేనని అంచనాకూ వచ్చారు. చంగ్‌ చియాన్‌లా మూసీ బ్యూటీ ఫికేషన్‌ సాధ్యమవుతుందా? డౌటే లేదనేది మన మంత్రుల మన్ కీ బాత్.. బ్యూటీఫికేషన్ కోసం ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొంటున్నారు.

మూసీ పునరుజ్జీవానికి చంగ్‌చియాన్‌ నది స్ఫూర్తి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ప్రజల సహకారంతో మూసీని కూడా ఇంత సుందరంగా అభివృద్ధి చేసి మార్పు మార్క్‌ చూపిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం మిషన్‌లో భాగంగా సుందరీకరణ కన్నా పునారావాసానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. సియోల్‌ బ్లూప్రింట్‌తో మూసీ బ్యూటీఫికేషన్‌ చేస్తామన్నారు.

పర్యాటకుల్ని ఆకర్సిస్తోన్న సియోల్‌లో చంగ్‌ చియాన్‌ సోయాగాలు తరహాలో మూసీ సుందీరకరణకు ముందగుడు పడుతోంది. సియోల్‌లో రివర్‌ మేనేజ్‌మెంట్‌ సహా వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై కూడా తెలంగాణ మంత్రుల బృందం అధ్యయనం చేస్తోంది. దక్షిణ కొరియాలోని మాపోలో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తూ విద్యుత్‌ ను ఉత్పత్తి చేస్తున్నారు.ఆ తరహా ప్లాంట్‌ను హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం..

వీడియో చూడండి..

ఇవాళ హన్‌ నదిపై అధ్యయనం

దక్షిణకొరియాలో పర్యటనలో భాగంగా తెలంగాణ బృందం రెండోరోజు మంగళవారం హన్‌నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. హన్‌ నదిపై అధ్యయనం చేయడంతోపాటు.. అక్కడున్న వ్యవస్థ గురించి తెలుసుకోనున్నారు. దక్షిణకొరియా దేశానికి.. ముఖ్యంగా సియోల్‌ పట్టణానికి సంబంధించి నీటిసరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉంది హన్‌నది.. ఒకప్పుడు కాలుష్యంలో ఉన్న హన్‌ నదిని శుభ్రపరిచి పునరుద్ధరించింది దక్షిణ కొరియా ప్రభుత్వం.. 494 కిలో మీటర్లమేర ప్రవహిస్తున్న హన్‌ నది, సియోల్‌ నగరంలో 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఒకప్పుడు కాలుష్య కాసారం, ఇప్పుడు పర్యాటక ప్రవాహంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..